నందమూరి బాలకృష్ణ ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా సోషల్ మీడియాలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మొన్న ‘వీరసింహారెడ్డి’ విజయోత్సవ వేడుకలో మాట్లాడుతూ.. ‘అక్కినేని తొక్కినేని’.. ‘ఆ రంగారావు ఈ రంగారావు’ అంటూ ఆయన యథాలాపంగా చేసిన కామెంట్లు పెద్ద వివాదానికే దారితీశాయి. బాలయ్య ఉద్దేశం ఏదైనప్పటికీ.. అక్కినేని వారిని కించపరిచారంటూ సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
బాలయ్య ఫ్యాన్స్, టీడీపీ మద్దతుదారులు ఎంత బాలయ్యను వెనకేసుకొచ్చే ప్రయత్నం జరిగినా సరే.. వారి ప్రయత్నం ఫలించలేదు. బాలయ్య పట్ల సానుకూల భావం ఉన్న వాళ్లు కూడా ఈ వ్యాఖ్యలను తప్పుబట్టారు. బాలయ్య చేసింది కచ్చితంగా తప్పు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐతే ఈ వివాదాన్ని అనుకున్నదానికంటే చాలా పెద్దదిగా మార్చేందుకు కుట్ర జరుగుతోందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయిప్పుడు.
బాలయ్య ఆ మాటలు అన్నాక ఒక రోజు వరకు వివాదం చిన్నదిగానే ఉంది. కానీ మంగళవారం ఒక్కసారిగా గొడవ చాలా పెద్దదిగా మారిపోయింది. సోమవారం రాత్రి నుంచే కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్.. బాలయ్య మీద తీవ్ర వ్యాఖ్యానాలు చేయడం, మరోవైపు అక్కినేని వారిని రెచ్చగొట్టడం చేశాయి. దీంతో నెమ్మదిగా చిచ్చు రాజుకుంది. అదే సమయంలో బాలయ్య అంటే పడని మెగా అభిమానులు కూడా రంగంలోకి దిగారు.
ఇదిలా ఉంటే ఎస్వీ రంగారావును కించపరిచారంటూ కాపు కుల నాయకులు కొందరు బాలయ్యకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తూ, క్షమాపణ చెప్పాల్సిందే అంటూ అల్టిమేటం విధించారు. నిజానికి ఎస్వీ రంగారావు కులం ఏంటో చాలామందికి తెలియదు. ఆయన్ని ఒక కులానికి పరిమితం చేసి ఎవ్వరూ చూడరు. ఆయన అలాంటి పరిమితులేమీ లేని విశ్వనటుడు. అలాంటి వ్యక్తికి కులం ఆపాదించి బాలయ్య మీద దాడికి దిగడంలో కుట్ర కోణం కనిపిస్తోందన్నది టీడీపీ వర్గాల మాట. అదను చూసి వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్, ఐప్యాక్ టీం రంగంలోకి దిగి.. దీన్ని కమ్మ-కాపు కుల గొడవగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని అనుమానిస్తున్నారు. పరిణామాలు చూస్తుంటే ఈ సందేహాలు నిజమే అనిపిస్తోంది.
This post was last modified on January 25, 2023 10:35 am
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…