రెండు చిన్న సినిమాలతో సక్సెస్ అందుకున్న అప్ కమింగ్ దర్శకుడికి మెగా ఆఫర్ వస్తే ? ఎలా ఉంటుంది ? ఆ ఆనందానికి అవధులుంటాయా ? సరిగ్గా ఇలాంటి కిక్కే వెంకీ కుడుముల పొందాడు. ఛలో , భీష్మ సినిమాలతో వరుస సక్సెస్ లు కొట్టి టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవడంతో మెగా స్టార్ ఈ కుర్ర దర్శకుడికి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు. RRR నిర్మాత దానయ్య నిర్మాణంలో చిరు -వెంకీ కాంబో సినిమా ఎనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది.
ఇంతలో ఏమైందో తెలియదు కానీ చిరు కుర్ర దర్శకుడికి నో చెప్పాడు. అనుకున్న ప్రాజెక్ట్ క్యాన్సల్ చేసుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా కుర్ర దర్శకుడి ఆశలపై నీళ్ళు చల్లారు చిరు. కారణం ఏదైనా కావచ్చు కానీ ఇలా అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ క్యాన్సల్ అంటే ఆ దర్శకుడి మనోవెధన ఎలా ఉంటుంది ? ఈ ఒక్క విషయం చిరు ఆలోచించలేకపోయారు. గతంలో గాడ్ ఫాదర్ సినిమా విషయంలోనూ సుజీత్ కి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. సుజీత్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడని స్వయంగా చెప్పిన చిరు తర్వాత ప్రాజెక్ట్ ను మోహన్ రాజా చేతిలో పెట్టారు.
ఇక ‘భీష్మ’ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మెగా ప్రాజెక్ట్ పట్టిన వెంకీ కుడుముల ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ షెల్వ్ అవ్వడంతో మరోసారి నితిన్ ను డైరెక్ట్ చేసే పనిలో ఉన్నాడు. చిరు, దానయ్య కాంబో మరో దర్శకుడి కోసం చూస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా మెగా స్టార్ ను నమ్ముకుంటే కుర్ర దర్శకుడికి ఇలా జరిగిందెంటో ? అంటూ ఇండస్ట్రీలో వెంకీ కుడుముల గురించి మాట్లాడుకుంటున్నారు. మరి వెంకీ హ్యాట్రిక్ హిట్ తో అందరికీ సమాధానం చెప్తాడెమో.