టాలీవుడ్ యువ కథానాయకుడు సందీప్ కిషన్ టాలెంటెడ్ అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘ప్రస్థానం’ చిత్రంలో విలన్ పాత్రతో అతను అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత హీరోగా ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’తో పెద్ద హిట్టు కొట్టి ప్రామిసింగ్ హీరో అయ్యేలా కనిపించాడు. కానీ ఆ తర్వాత ఆ స్థాయి హిట్టు ఒక్కటీ పడలేదు సందీప్‌కు. తన మామ ఛోటా కే నాయుడికి ఉన్న పరిచయాల వల్లో, తన వ్యక్తిత్వం వల్లో సందీప్‌కు అవకాశాలకైతే లోటు లేదు. కానీ సరైన హిట్ మాత్రం అతడికి దక్కట్లేదు.
రకరకాల జానర్లలో సినిమాలు చేసి ఫెయిలైన అతను.. ఒక మంచి విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ లోటును ఓ తమిళ సినిమా తీర్చేలా కనిపిస్తోంది. ఆ చిత్రమే.. మైకేల్. తెలుగుతో పోలిస్తే సందీప్‌కు తమిళంలో మంచి మంచి సినిమాలే పడ్డాయి. మానగరం, మాయవన్, కసాటా డబారా లాంటి చిత్రాలతో అతను తమిళ ప్రేక్షకుల మనసులు దోచాడు.
ఇప్పుడు ‘మైకేల్’ రూపంలో సందీప్‌కు కెరీర్లోనే అతి పెద్ద అవకాశం దక్కింది. విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ లాంటి ఆర్టిస్టులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్లలో క్వాలిటీ చూసి మతి పోతోంది. ఒక పెద్ద స్టార్ హీరో సినిమా రేంజ్ కనిపిస్తోంది. ప్రోమోలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండడం, సినిమా స్యూర్ షాట్ హిట్ లాగా కనిపిస్తుండడంతో అంచనాలు పెరిగిపోయాయి.
ఇది సందీప్ కెరీర్లో గేమ్ ఛేంజర్ అవుతుందనే ఆశలు కలుగుతున్నాయి. ఇప్పటిదాకా తేడా కొట్టిన లెక్కలన్నింటినీ సందీప్ ఈ సినిమాతో సరి చేస్తాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే మాత్రం అటు తమిళంలో, ఇటు తెలుగులో సందీప్ రేంజ్ మారిపోవడం ఖాయం. ఈ చిత్రాన్ని రంజిత్ జయకొడి రూపొందించాడు. ఫిబ్రవరి 3న ‘మైకేల్’ తమిళ, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
This post was last modified on January 24, 2023 7:05 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…