‘వీర సింహా రెడ్డి’ సక్సెస్ సెలెబ్రేషన్స్ ఈవెంట్ లో అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య మాట తూలడంతో వీడియో వైరల్ అయింది. దీంతో అక్కినేని కుటుంబంతో పాటు ఫ్యాన్స్ కూడా బాలయ్య వ్యాఖ్యలపై స్పందించారు. సోషల్ మీడియాలో బాలయ్య ఒక సీనియర్ నటుడిని అలా అనడం తగదని పోస్టులు పెడుతూ తప్పుబడుతున్నారు. తాజాగా అక్కినేని హీరోలు నాగ చైతన్య , అఖిల్ కూడా సోషల్ మీడియా వేదికగా ఓ నోట్ పెట్టి రియాక్ట్ అయ్యారు.
నందమూరి తారకరామరావు గారు అక్కినేని నాగేశ్వరరావ్ గారు SV రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు , వారిని అగౌరవ పరచడం మనల్ని మనం కించపరచుకున్నట్లేనని రియాక్ట్ అయ్యారు. అయితే అక్కినేని ఫ్యామిలీ నుండి చైతూ , అఖిల్ మాత్రమే సోషల్ మీడియాలో బాలయ్య వ్యాఖ్యలపై రెస్పాండ్ అయ్యారు. ఈ విషయంపై నాగార్జున ఇంకా రియాక్ట్ అవ్వకపోవడంతో అక్కినేని ఫ్యాన్స్ నాగ్ స్పందించడేంటి ? అంటూ మాట్లాడుకుంటున్నారు. నిజానికి నాగ్ ఈ విషయంలో మౌనంగా ఉండటం ఫ్యాన్స్ కి నచ్చడం లేదు.
ఇక అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ కూడా రెస్పాండ్ అవ్వలేదు. బాలయ్య తో కలిసి సుమంత్ కథానాయకుడు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావ్ గారి పాత్రలో నటించాడు. బహుశా అందుకే ఈ విషయంపై రియాక్ట్ అవ్వడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి నాగార్జున బాలయ్య కామెంట్ పై ఎలా ఎప్పుడు రియాక్ట్ అవుతాడో ? లేదా బాలయ్య విజ్ఞతకే ఈ విషయాన్ని వదిలేస్తాడా ? చూడాలి.
This post was last modified on January 24, 2023 10:15 pm
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…
సంక్రాంతి పండక్కు తెలుగు రాష్ట్రాల థియేటర్లకు ఊహించిన సమస్యే తలెత్తింది. షోలు చాలక ప్రేక్షకుల డిమాండ్ అధికం కాగా దానికి…
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…