షూటింగ్ ఎప్పుడో పూర్తయినా టీజర్ వచ్చి నెలలు దాటుతున్నా ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయిన శాండల్ వుడ్ మరో బిగ్ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ కబ్జా ఎట్టకేలకు రిలీజ్ డేట్ ని ఫైనల్ చేసుకుంది. అన్ని భాషల్లోనూ మార్చి 17 థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కెజిఎఫ్ ని స్ఫూర్తిగా తీసుకుని ఇంచుమించు అదే కథలా అనిపించే టేకింగ్ తో కబ్జా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకుల్లో హైప్ ని తీసుకురాలేకపోయింది. ఉపేంద్ర, కిచ్చ సుదీప్ లాంటి మల్టీ స్టారర్ కోటింగ్ ఉన్నా సరే ప్రమోషన్ ఆశించిన స్థాయిలో జరగలేదు.
ఇదంతా ఎలా ఉన్నా విడుదల తేదీ విషయంలో మాత్రం కబ్జా తెలివైన పనే చేసింది. ఫిబ్రవరిలో తెలుగులో విపరీతమైన పోటీ నెలకొంది. మైఖేల్, హంట్, అమిగోస్, శాకుంతలం, వినరో భాగ్యము విష్ణు కథ, సర్ ఇలా చాలానే క్యూ కట్టాయి. మార్చిలో ఆ సమస్య లేదు. కాకపోతే ఈ కబ్జా లాక్ చేసుకున్న డేట్ నే విశ్వక్ సేన్ తన ధమ్కీ కోసం ప్లాన్ చేస్తున్నాడు. ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కానీ ప్రాథమికంగా ఇదే అనుకున్నారు . ఒకవేళ క్లాష్ అయినా పరస్పరం ఇద్దరికీ వచ్చిన ఇబ్బందేమీ లేదు. జానర్లు క్యాస్టింగ్ లు పూర్తి విరుద్ధం కాబట్టి ఎవరి మార్కెట్ వాళ్లకు ఇబ్బంది లేకుండా వచ్చేస్తుంది.
కబ్జా కూడా టైం పీరియడ్ మాఫియా డ్రామానే. విజువల్స్ వగైరాలు ఫ్రెష్ గా అనిపించకపోయినా రిచ్ గా ఉన్నాయి. ఇందులో శ్రేయ హీరోయిన్ గా నటించగా సలార్ లాంటి క్రేజీ ప్రాజెక్టులు చేతిలో ఉన్న రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. కథా నేపధ్యాన్ని 1947 నుంచి 1984 మధ్యలో సెట్ చేసుకున్నారు. ఈ కాలంలో ఎదిగిన ఒక గ్యాంగ్ స్టర్ కథే ఈ కబ్జా. కోట శ్రీనివాసరావు, సముతిరఖని, ప్రదీప్ రావత్, మనోజ్ బాజ్ పాయ్, మురళి శర్మ ఇలా క్యాస్టింగ్ పెద్దగానే ఉంది. సెటప్ అంతా బాగానే ఉంది కాబట్టి బాక్సాఫీస్ ఈ కబ్జా ఏ స్థాయిలో ఎలా ఆక్రమించుకుంటుందో వేచి చూడాలి.
This post was last modified on January 24, 2023 12:09 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…