ప్రేమమ్.. అంత సులువుగా మరిచిపోయే సినిమా కాదిది. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యంత గొప్ప ప్రేమకథా చిత్రాల్లో ఒకటిగా.. ఆల్ టైం క్లాసిక్‌గా పేరు తెచ్చుకున్న ఈ మలయాళ సినిమా.. మలయాళీలనే కాక అన్ని భాషల వాళ్లనూ అమితంగా ఆకట్టుకుంది. భాష తెలియకపోయినా.. సబ్ టైటిల్స్ లేకపోయినా కూడా ఈ సినిమా చూసి మైమరిచిపోయి.. ప్రేమమ్ జ్ఞాపకాల్ని మనసుల్లో పదిలంగా దాచుకున్న ప్రేక్షకులు ఎంతమందో. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తే ఇక్కడా మంచి విజయం సాధించింది. ఇలాంటి దృశ్యకావ్యాన్ని అందించిన దర్శకుడు.. అల్ఫాన్సో పుతెరిన్.
ఐతే ఇలాంటి క్లాసిక్ అందించాక అల్ఫాన్సో ఆరేళ్లకు పైగా సినిమా చేయకపోవడం ఆశ్చర్యకరం. చాలా గ్యాప్ తర్వాత అతను గోల్డ్ అనే సినిమా తీశాడు. పృథ్వీరాజ్ సుకుమారన్, నయనతార లాంటి పేరున్న నటీనటులు ఇందులో లీడ్ రోల్స్ చేశారు. ఐతే గత నెలలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది.
ఇక అప్పట్నుంచి అల్ఫాన్సోను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇటు ట్విట్టర్, అటు ఫేస్ బుక్‌లో హేట్ మెసేజ్‌లతో అతణ్ని వేదనకు గురి చేస్తున్నారు. దీంతో కలత చెందిన అల్ఫాన్సో ఫేస్‌బుక్‌లో తన డీపీని తీసేసి నిరసన వ్యక్తం చేశాడు. ఇలాగే ట్రోల్స్ కొనసాగితే తాను సోషల్ మీడియా నుంచి వెళ్లిపోతానని అతను అన్నాడు.
“మీ సంతృప్తి కోసం నన్ను ట్రోల్ చేస్తున్నారు. దూషిస్తున్నారు. నా సినిమా గోల్డ్ గురించి చెత్తగా మాట్లాడుతున్నారు. ఈ విధంగా చేయడం మీకు బాగా అనిపిస్తుంది. కానీ, నాకు ఎంత మాత్రం కాదు. నా చిత్రం నచ్చితే చూడండి. కోపాన్ని చూపడానికి మాత్రం నా పేజికి రాకండి. మీరు ఆ విధంగా చేస్తే నేను సోషల్ మీడియా అకౌంట్స్‌ను తొలగిస్తాను. గతంలో మాదిరిగా నేను లేను. నేను అపజయాలు ఎదుర్కొనప్పుడల్లా నా భార్య, పిల్లలు, కొంత మంది వ్యక్తులు నాకు అండగా నిలిచారు. పరాజయాలు ఎదురు కావాలని ఎవరు కొరుకోరు. సహజసిద్ధంగా అది జరుగుతుంది” అని అల్ఫోన్సో తన పోస్టులో పేర్కొన్నాడు.
This post was last modified on January 24, 2023 6:15 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…