బాలీవుడ్లోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగు పెట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన హీరో కార్తీక్ ఆర్యన్. కెరీర్ ఆరంభంలో చిన్న సినిమాలే చేసినా.. ఆ తర్వాత అతడి రేంజ్ కాస్త పెరిగింది. ఐతే మధ్యలో కరణ్ జోహార్ అతణ్ని ఓ సినిమా నుంచి తీసేయడం.. ఇంకో సినిమా కూడా అతడి చేజారడం చూసి ఇక అతను పైకెదగడం కష్టమే అని చాలామంది తేలిగ్గా తీసిపారేశారు. కానీ ‘భూల్ భూలయియా-2’తో అతను బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు.
ఓవైపు బాలీవుడ్ సూపర్ స్టార్ల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వరుసగా చతికిలపడుతున్న టైంలో కార్తీక్ ఆర్యన్ నటించిన ఈ హార్రర్ కామెడీ బ్లాక్ బస్టర్ అయి ఇండస్ట్రీకి గొప్ప ఉపశమనాన్ని అందించింది. ఆ సినిమాతో అతడి రేంజే మారిపోయింది. డిమాండ్ అమాంతం పెరిగింది. మిడ్ రేంజ్ స్టార్‌గా ఎదిగిన కార్తిక్.. తాజాగా ఒక సినిమాకు రోజుకు రెండు కోట్ల చొప్పున పారితోషకం అందుకున్నాడట.
ఈ విషయాన్ని కార్తీకే స్వయంగా వెల్లడించడం విశేషం. తొలి సినిమా ‘ప్యార్ కా పంచనామా’కు కేవలం రూ.1.25 లక్షల రూపాయల పారితోషకం తీసుకున్న కార్తీక్.. తాజాగా ఓ సినిమాకు రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది.
దీని గురించి ఒక టీవీ షోలో కార్తీక్ స్పందిస్తూ.. “నేను కరోనా టైంలో ఒక సినిమా చేశాను. ఆ సినిమాలో నా పాత్ర చిత్రీకరణ 10 రోజుల్లోనే పూర్తయింది. తక్కువ సమయంలో సినిమాను పూర్తి చేయడం వల్ల నిర్మాతలకు రెట్టింపు లాభం దక్కింది. అందుకే నాకు ఆ పారితోషకం దక్కింది. అందుకు నేను అర్హుడినే అనుకుంటున్నా” అని కార్తీక్ అన్నాడు. ఆ సినిమాకు రూ.20 కోట్ల పారితోషకం తీసుకున్న కార్తీక్.. పని చేసింది పది రోజులే కాబట్టి రోజుకు రూ.2 కోట్లు పుచ్చుకున్నట్లు అయింది. కార్తీక్‌కు ఇప్పుడున్న డిమాండ్ ప్రకారం, వేరే హీరోలు అందుకుంటున్న దాంతో పోలిస్తే ఇదేమీ ఎక్కువగా అనిపించదు.
This post was last modified on January 23, 2023 6:44 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…