నందమూరి బాలకృష్ణ సినిమాల్లో కథలన్నీ కూడా ఎక్కువగా ఆంధ్రా, రాయలసీమ, అ ప్రాంతాల చుట్టూ తిరుగుతుంటాయి. కొంచెం హైదరాబాద్ టచ్ ఉంటుందే తప్ప.. పక్కా తెలంగాణ నేపథ్యంలో, ఇక్కడి యాసతో బాలయ్య తెరకెక్కిన బాలయ్య సినిమాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ఈ ప్రాంత నేపథ్యంలో కొన్ని కథలు తెరకెక్కి ఉండొచ్చేమో కానీ.. బాలయ్య తెలంగాణ యాసలో డైలాగులు చెప్పడం.. పూర్తిగా ఈ ప్రాంతంలోనే కథ నడవడం జరగలేదనే చెప్పాలి. కానీ తొలిసారిగా అనిల్ రావిపూడి బాలయ్యతో ఈ ప్రయోగం చేస్తున్నాడని వెల్లడైంది.
బాలయ్య లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ విజయోత్సవ వేడుకలో అనిల్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. ‘వీరసింహారెడ్డి’లో బాలయ్య రాయలసీమ నేపథ్యంలో విశ్వరూపం చూపించాడని.. తన సినిమాలో తెలంగాణలో దూకుడు చూపించబోతున్నాడని అనిల్ చెప్పాడు.
“బాలకృష్ణ గారితో నేను చేస్తున్న సినిమా ఒక షెడ్యూల్ పూర్తయింది. ఆ సినిమా కథా చర్చల్లో కానీ.. షూటింగ్ టైంలో కానీ ఆయనతో మాట్లాడుతుంటే అభిమానులను ఎంతగా దృష్టిలో పెట్టుకుంటారో అర్థమైంది. ఒక సినిమా చేస్తున్నపుడు మామూలు ప్రేక్షకులతో పాటు అభిమానులకు కూడా అది నచ్చాలని ఎంతో కేర్ తీసుకుంటారు. అందుకే ప్రతి సినిమాలోనూ ‘ఎన్.బీ.కే’ టచ్ యాడ్ చేస్తారు. ఆ ‘ఎన్.బీ.కే’ టచ్‌తోనే ‘వీరసింహారెడ్డి’ వచ్చింది. నేను తీస్తున్న 108వ సినిమా కూడా ఆ టచ్‌తోనే రాబోతోంది. కాకపోతే ఈసారి అన్న రాయలసీమలో కాదు తెలంగాణలో దిగుతుండు. బాక్సాఫీస్ ఊచకోత షురూ చేస్తడు. కలెక్షన్లతో కుర్బానీ పెడతడు” అంటూ తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఈ సినిమా బ్యాక్‌డ్రాప్ గురించి వివరించాడు అనిల్ రావిపూడి.
నేపథ్యం వరకు తెలంగాణ అయితే ఓకే కానీ.. బాలయ్య తెలంగాణ యాసలో డైలాగులు చెబుతాడంటేనే ఏదోలా అనిపిస్తోంది. నిజంగా ఆ యాస బాలయ్యకు సెట్ అవుతుందా?
This post was last modified on January 23, 2023 12:23 pm
హైదరాబాద్ ఫుడ్ కు దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. సెలబ్రెటీలులకు సైతం గౌరవం ఎక్కువ.…
సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ ప్రస్తుతం అభిమానుల మధ్య హాట్ టాపిక్ అయింది. ఇటీవలి కాలంలో గడ్డం,…
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…