వర్కవుట్ చేస్తే మగాడిలా ఉన్నావంటున్నారు-Rashmika

Rashmika సోషల్ మీడియాలో ఎప్పుడూ వార్తల్లో ఉండే కథానాయికల్లో రష్మిక మందన్నా ఒకరు. ఆమె కొన్నిసార్లు పాజిటివ్ న్యూస్‌లతో వార్తల్లో ఉంటే.. కొన్నిసార్లు నెగెటివ్ న్యూస్‌లతో మీడియాకు ఎక్కుతుంటుంది.

సోషల్ మీడియాలో ఆమె గురించి నిత్యం ఏదో ఒక చర్చ నడుస్తుంటుంది. నెటిజన్లు ఆమె మీద హేట్ కామెంట్లతో రెచ్చిపోతుంటారు. ఐతే తనతో ఎవరికి ఏ సమస్య ఉందో అర్థం కాదని.. తాను ఏం చేసినా ఏదో ఒక నెగెటివ్ కామెంట్ చేస్తూనే ఉంటారంటూ ఒక ఇంటర్వ్యూలో రష్మిక ఆవేదన వ్యక్తం చేసింది.

తాను గాలి పీల్చినా కూడా కొందరికి సమస్యే అని ఆమె కామెంట్ చేయడం గమనార్హం. సోషల్ మీడియాలో తన మీద ఉన్నంత నెగెటివిటీ ఇంకెవరి మీదా ఉండదన్నట్లు ఆమె మాట్లాడింది.

‘‘నేను బాగా వర్కవుట్ చేసి ఫిట్‌గా ఉందామని ప్రయత్నిస్తే.. మగాడిలా ఉన్నావు అంటారు. వర్కవుట్ చేయకుంటే కొవ్వు ఎక్కువైందని అంటారు. దేని గురించైనా మాట్లాడితే చెత్తగా మాట్లాడానని అంటారు. ఏం మాట్లాడకుండా సైలెంటుగా ఉంటే యాటిట్యూడ్ అంటారు. అసలుం నేనేం చేసినా తప్పే అంటే ఎలా? చివరికి నేను గాలి పీల్చినా కూడా అందులో కూడా తప్పు వెతుకుతారేమో. అసలు వీళ్ల సమస్య ఏంటో అర్థం కాదు. నేను ఇండస్ట్రీలో ఉండాలా.. వెళ్లిపోవాలా.. ఆ విషయం అయినా సూటిగా చెబితే అలా చేయడానికి నేను రెడీ. ఎందుకు ఇంత నెగెటివిటీ చూపిస్తారో నాకు అర్థం కాదు’’ అంటూ రష్మిక ఆవేదన వ్యక్తం చేసింది.

‘కాంతార’ సినిమాకు సంబంధించి తాను చేసిన కామెంట్‌ను పట్టుకుని వివాదం రాజేశారని.. నిజానికి ఆ చిత్ర దర్శకుడు రిషబ్ శెట్టి మీద తనకు ఎంతో గౌరవం ఉందంటూ.. రిషబ్, రక్షిత్ కలిసి తనకు ‘కిరిక్’ పార్టీలో తొలి అవకాశం ఎలా ఇచ్చారో గుర్తు చేసుకుంది రష్మిక. ఈ సందర్భ:గా రిషబ్, రక్షిత్‌లను ఆమె సర్ అంటూ సంబోధించింది.