Movie News

సునీల్ వెంటపడుతున్న కోలీవుడ్

ఒకప్పుడు కమెడియన్ గా సునీల్ డిమాండ్ మాములుగా ఉండేది కాదు. బ్రహ్మానందం భీభత్సమైన ఫామ్ లో ఉన్నప్పుడు సైతం తనదైన టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వించడంలో ఈ హాస్య నటుడు ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. హీరోగా అందాల రాముడు ఇచ్చిన విజయం, రాజమౌళి అంతటివాడు మర్యాదరామన్నగా చూపిస్తే జనం ఆదరించిన తీరు తన కెరీర్ ప్లానింగ్ ని పూర్తిగా మార్చేశాయి. క్యారెక్టర్ వేషాలకు స్వస్తి చెప్పేసి పూర్తి కథానాయకుడిగా మారిపోయాడు. తర్వాత పూల రంగడులాంటి ఒకటి రెండు హిట్లు తప్పించి చెప్పుకోదగ్గ బ్రేకులు రాలేదు. దాంతో కొంత గ్యాప్ తీసుకుని తిరిగి రెగ్యులర్ వేషాలకు వచ్చేశాడు.

అరవింద సమేత వీర రాఘవ, కలర్ ఫోటోలు గట్రా బాగానే పేరు తెచ్చినప్పటికీ పుష్పలో చేసిన విలన్ పాత్ర సునీల్ ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. మళ్ళీ ఒకనాటి బిజీ ఆర్టిస్టుగా మార్చేసింది. ముఖ్యంగా కోలీవుడ్ నుంచి సునీల్ కు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ లో చాలా కీలకమైన భాగంలో కనిపించబోతున్నాడు. కార్తీ జపాన్ లో హీరోతో పాటు ప్రయాణం చేసే వాడిగా మంచి పేరు వస్తుందని ఇన్ సైడ్ టాక్. విశాల్ మార్క్ ఆంటోనీలో ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారట. శివ కార్తికేయన్ హై బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ మావీరన్ లోనూ సునీల్ కు ఛాన్స్ దక్కింది.

నిజానికి తెలుగులో కంటే తమిళంలోనే సునీల్ కు అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. తనకూ ఒక మార్పులా ఉంటుందని నో అనకుండా ఒప్పేసుకుంటున్నాడు. వరస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు వచ్చిన గ్యాప్ ని ఈ విధంగా పూడ్చుకునే ప్లానింగ్ బాగుంది. పైన చెప్పినవాటిలో ఏ రెండు హిట్ అయినా అరవ సినిమాల్లోనూ జెండా పాతేయొచ్చు. మనకు హాస్య నటుడిగా ఎక్కువ పరిచయం కానీ అక్కడి వాళ్లకు మాత్రం పుష్పలో మంగళం శీనుకి బాగా రిజిస్టర్ అయిపోయాడు. అన్నట్టు దీని రెండో భాగంలో అనసూయ గొంతు కోశాక జరిగే కథలో సునీల్ కి పెద్ద లెన్త్ ఇచ్చాడట దర్శకుడు సుకుమార్.

This post was last modified on January 22, 2023 1:49 pm

Share

Recent Posts

అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్ అదిరింది

ఇప్పుడున్న టాలీవుడ్ దర్శకుల్లో అనిల్ రావిపూడి అనుసరించే ప్రమోషన్ ప్లాన్లు వేరెవరు చేయలేరన్నది వాస్తవం. కాపీ చాలా మంది కొడుతున్నారు…

27 minutes ago

వైసీపీ పంపేయాల‌నుకుంది.. కానీ, కియా విస్త‌రిస్తోంది!

అనంతపురంలో కియా కార్ల తయారీ రెండో ప్లాంట్‌కు ఏపీ ప్రభుత్వంతో సంస్థ ఒప్పందం చేసుకోవ‌డం.. రాజ‌కీయంగా కూడా ప్రాధాన్యం సంత‌రించుకుంది.…

28 minutes ago

ఏపీలో పంచాయతీ ఎన్నికలు.. జెండాలు లేకున్నా.. అజెండాలే!

ఏపీలో ఇటీవ‌లి వ‌రకు స్థానిక మునిసిపాలిటీ, కార్పొరేష‌న్‌, ఎంపీటీడీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల సంద‌డి కొన‌సాగింది. కొన్ని చోట్ల ఘ‌ర్ష‌ణ‌లు చోటు…

30 minutes ago

సర్‌ప్రైజ్… దిల్ రాజుతో పవన్ సినిమా!

ఏపీ డిప్యూటీ సిఎంగా ఒకపక్క విపరీతమైన బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ఇంకోవైపు జనసేన వ్యవహారాలతోనూ టైం లేనంతగా సతమతమవుతున్నారు.…

50 minutes ago

సంక్రాంతి రేసులోకి కొత్త సినిమా?

2027 సంక్రాంతి సీజన్‌కు ఇంకో రెండు నెలల సమయమే ఉంది. కానీ ఇప్పటికీ పండగ సినిమాల మీద పూర్తి స్పష్టత…

2 hours ago

యష్ చేయబోయే నెక్స్ట్ సినిమా ఏంటి

2026 ఒకే సంవత్సరంలో యష్ కు రెండు విభిన్నమైన ఫలితాలు దక్కాయి. టాక్సిక్ దారుణంగా డిజాస్టర్ కావడమే కాకుండా కంటెంట్…

2 hours ago