బాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కథానాయిక కంగనా రనౌత్. కెరీర్లో కొన్నేళ్లు రెగ్యులర్ గ్లామర్ రోల్సే చేసిన ఆమె.. క్వీన్ దగ్గర్నుంచి రూటు మార్చింది. ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ పెరగడంతో ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే పరిమితం అయింది. మణికర్ణిక లాంటి సినిమాలు ఆమె ఇమేజ్‌ను మరింత పెంచాయి. కానీ ఆ తర్వాత కంగనాకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.
గత ఏడాది కంగనా ప్రధాన పాత్ర పోషించిన ధకడ్ పెద్ద డిజాస్టర్ అయింది. దాదాపు వంద కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్ల నుంచి పదో వంతు కూడా వసూలు చేయలేకపోయింది. అయినా సరే.. కంగనా తగ్గట్లేదు. మళ్లీ ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీని లైన్లో పెట్టింది. అదే.. ఎమర్జెన్సీ. ఈ చిత్రానికి దర్శకురాలు, నిర్మాత కూడా కంగనానే. ఈ సినిమా కోసం తన ఆస్తులన్నీ తాకట్టు పెట్టినట్లుగా కంగనా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.
అనేక కష్ట నష్టాలకు ఓర్చి తాను ఎమర్జెన్సీ సినిమా తీసినట్లు కంగనా తెలిపింది. ఎమర్జెన్సీ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ రోజు ఎమర్జెన్సీ షూట్ పూర్తి చేశాను. నా జీవితంలో అద్భుత ఘట్టం చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా కోసం నేను ఏ కష్టం పడలేదని అందరూ అనుకుంటున్నారు. కానీ వాస్తవం వేరు. నాకు సంబంధించిన ఆస్తులన్నీ ఈ సినిమా కోసం తాకట్టు పెట్టాను.
ఇక ఆరోగ్య పరంగా ఈ సినిమా చేస్తూ చాలా ఇబ్బంది పడ్డాను. డెంగీ బారిన పడి రక్త కణాల సంఖ్య భారీగా పడిపోయింది. అయినా తట్టుకుని నిలబడ్డాను. షూటింగ్‌కు హాజరయ్యాను. ఈ సమస్యను అధిగమించడం చాలా కష్టమైంది. ఇది నాకు పునర్జన్మ అని కంగనా పేర్కొంది. ఐతే ఈ సినిమాకు కంగనా పేరు నిర్మాతగా పడ్డప్పటికీ ఎమర్జెన్సీ కాన్సెప్ట్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాబట్టి ఈ సినిమాకు బీజేపీ ఫండింగ్ చేస్తున్నట్లు భావిస్తున్నారు.
This post was last modified on January 21, 2023 10:17 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…