Movie News

ఇండియాలో అవతార్ 2 సరికొత్త రికార్డు

విపరీతమైన అంచనాలు మోసుకుని రిలీజైన రోజు కొంత మిశ్రమ స్పందన దక్కించుకున్నప్పటికీ అవతార్ 2 ది వే అఫ్ వాటర్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేసింది. ఇప్పటిదాకా మన దేశంలో టాప్ 1 గ్రాసర్ గా ఉన్న హాలీవుడ్ మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్. 2019లో రిలీజైన ఈ సూపర్ హీరోస్ ఎంటర్ టైనర్ వసూలు చేసిన మొత్తం గ్రాస్ 438 కోట్లు కాగా అన్ని ఖర్చులు పోను నెట్ 367 కోట్లు. ఇప్పుడు అవతార్ 2 దాన్ని పెద్ద మార్జిన్ తో దాటేసింది. జేమ్స్ క్యామరూన్ విజువల్ వండర్ గ్రాస్ రూపంలో 475 కోట్లు తేగా నెట్ 368 కోట్ల 20 లక్షలు దాటేసింది. సో నెంబర్ వన్ స్థానం అఫీషియల్ గా దక్కేసింది.

నెల రోజులు పూర్తయినప్పటికీ అవతార్ 2 చాలా చోట్ల మంచి రన్ కొనసాగిస్తోంది. ముఖ్యంగా నార్త్ లో అజయ్ దేవగన్ దృశ్యం 2 తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో ఏ సినిమా కనీస స్థాయిలో ఆడలేకపోవడంతో ఆ అడ్వాంటేజ్ ని అవతార్ 2 పూర్తిగా వాడుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ దీని దూకుడు ఓ రేంజ్ లో సాగింది. ఇప్పటికీ హైదరాబాద్ మెయిన్ మల్టీప్లెక్సుల్లో హౌస్ ఫుల్స్ పడుతూనే ఉన్నాయి. బాలకృష్ణ ఏరికోరి మరీ ప్రసాద్ లార్జ్ స్క్రీన్ షో చూశారంటే దీని ఫీవర్ ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం ఈ త్రీడి మాయాజాలాన్ని ఎంజాయ్ చేశారు.

పఠాన్ వస్తున్న తరుణంలో స్పీడ్ తగ్గుతుందేమో కానీ అవతార్ 2 ఫైనల్ రన్ మాత్రం ఇంకో రెండు మూడు వారాలు ఖచ్చితంగా ఉంటుంది. ఫిబ్రవరిలో ఓటిటి ప్రీమియర్ ఉండొచ్చనే లీక్ ఆల్రెడీ వచ్చేసింది. అదే జరిగితే అక్కడా వ్యూస్ పరంగా రికార్డుల ఊచకోత ఖాయం. వరల్డ్ వైడ్ ఇప్పటికే 2022 నెంబర్ వన్ గా ఉన్న టాప్ గన్ మావరిక్ ని దాటేసిన అవతార్ రెండు బిలియన్ డాలర్లను ఈ రెండు మూడు రోజుల్లో అనుకోనుంది. మన ఆడియన్స్ ఇంగ్లీష్ సినిమాల పట్ల ఎంత క్రేజీగా ఉన్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఫిబ్రవరి 10న రాబోతున్న టైటానిక్ రీ రిలీజ్ కు ఘనస్వాగతం చెప్పేందుకు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు

This post was last modified on January 21, 2023 6:46 pm

Share
Show comments
Published by
Satya
Tags: avatar 2

Recent Posts

నెగిటివిటీ ప్రభావానికి సినీ బాధితులు ఎందరో

సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…

4 hours ago

విశాల్ ప్రభావం – 30 సినిమాల బూజు దులపాలి

పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…

5 hours ago

అఖండ 2 ఇంటర్వల్ కే మీకు పైసా వసూల్ : తమన్

ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…

6 hours ago

మాకు సలహాలు ఇవ్వండి బిల్ గేట్స్‌కు చంద్ర‌బాబు ఆహ్వానం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు,…

7 hours ago

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ…

7 hours ago

రిలయన్స్ న్యూ కరెన్సీ.. జియో కాయిన్

ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…

7 hours ago