ఈ మధ్య కాలంలో దక్షిణాదిన సెన్సేషన్ క్రియేట్ చేసిన చిన్న సినిమా అంటే ‘లవ్ టుడే’ అనే చెప్పాలి. దర్శకుడిగా ఒక సినిమా అనుభవం ఉన్న ప్రదీప్ రంగనాథన్ అనే కుర్రాడు.. తనే హీరోగా నటిస్తూ రూపొందించిన ఈ చిత్రం తమిళనాట సంచలనం రేపింది. పెద్ద సినిమాల రేంజిలో వసూళ్లు కొల్లగొట్టింది.
ఈ చిత్రాన్ని తెలుగులో అగ్ర నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేస్తే.. ఇక్కడా మంచి ఫలితమే అందుకుంది. ప్రేమలో పడి పెళ్లికి సిద్ధమైన ఒక యువ జంట.. అమ్మాయి తండ్రి కండిషన్ మేరకు ఒక రోజు తమ ఇద్దరి ఫోన్లు మార్చుకోవడం.. తత్ఫలితంగా ఎదురయ్యే పరిణామాల నేపథ్యంలో చాలా సరదాగా, ఉత్కంఠభరితంగా సాగిపోయిన చిత్రమిది. ఈ ఐడియాతో ఇప్పటి యువత బాగా రిలేట్ అయ్యారు. తమ జీవితంలోనూ ఇలా జరిగితే ఎలా ఉంటుందనే ఊహ చాలామందికి వచ్చి ఉంటుందనడంలో సందేహం లేదు.
ఐతే తమిళనాట ఒక యువ జంట ‘లవ్ టుడే’ సినిమా నుంచి స్ఫూర్తి పొంది ఫోన్లు మార్చుకోవడంతో తీవ్ర పరిణామాలు తలెత్తి.. చివరికి వారి పెళ్లి రద్దయిపోవడం గమనార్హం. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన అరవింద్‌కు ఒక అమ్మాయితో ఇటీవలే నిశ్చితార్థం జరిగింది.
పెళ్లికి ముందు ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ‘లవ్ టుడే’ స్ఫూర్తితో ఇద్దరూ ఫోన్లు మార్చుకున్నారు. ఐతే అరవింద్ మొబైల్‌ను చెక్ చేస్తుండగా.. అందులో నగ్నంగా ఉన్న ఒక బాలిక వీడియో కనిపించడంతో అమ్మాయి షాక్ తింది.
ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న ఆ అమ్మాయి అరవింద్‌తో పెళ్లినే రద్దు చేసుకుంది. వీడియోలో ఉన్న బాలికకు కూడా ఈ విషయం చెప్పిందట. విషయం పెద్దదిగా మారి పోలీసులు అరవింద్‌ను అరెస్టు చేసే వరకు పరిస్థితి వెళ్లింది.
This post was last modified on January 21, 2023 3:13 pm
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…
సంక్రాంతి పండక్కు తెలుగు రాష్ట్రాల థియేటర్లకు ఊహించిన సమస్యే తలెత్తింది. షోలు చాలక ప్రేక్షకుల డిమాండ్ అధికం కాగా దానికి…
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…