ఈ రోజుల్లో పెద్ద తెలుగు సినిమాలు చాలా వరకు పాన్ ఇండియా స్థాయిలో రిలీజవుతున్నాయి. వీలైనంత వరకు ఒకేసారి తెలుగుతో పాటు మిగతా వెర్షన్లనూ రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్నిసార్లు కుదరకుంటే కొన్ని వారాలు ఆలస్యంగా హిందీలో రిలీజ్ చేస్తున్నారు.
కానీ విచిత్రంగా నందమూరి బాలకృష్ణ చిత్రం ‘అఖండ’ను మాత్రం తెలుగులో విడుదలైన సంవత్సరం తర్వాత హిందీలో రిలీజ్ చేశారు. ఓటీటీలో ఎప్పట్నుంచో అందుబాటులో ఉన్న తెలుగు వెర్షన్‌ను హిందీ జనాలు సబ్ టైటిల్స్‌తో్ చూశారు.
అయినా సరే.. ఇంత ఆలస్యంగా హిందీలో డబ్ చేసి రిలీజ్ చేశారీ చిత్రాన్ని. ఐతే ఈ ఆలస్యానికి తోడు.. డబ్బింగ్ కూడా సరిగా లేకపోవడంతో ‘అఖండ’ హిందీలో ఏమాత్రం ప్రభావం చూపుతుందో అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆశ్చర్యంగా ఈ చిత్రం తొలి రోజు ఉత్తర భారతంలో మంచి స్పందనే తెచ్చుకున్నట్లు కనిపిస్తోంది.
ఉత్తరాదిన మాస్ ఏరియాల్లో ‘అఖండ’ణు బాగానే రిసీవ్ చేసుకున్నట్లు సోషల్ మీడియా ట్రెండ్స్‌ను బట్టి తెలుస్తోంది. అక్కడ సినిమా టాక్ చెబుతున్న జనాలందరూ సినిమా సూపరని అంటుండడం.. పలు నగరాల్లో షోలు హౌస్ ఫుల్స్, ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో కనిపిస్తుండడం చూస్తే.. ‘అఖండ’ హిందీ వెర్షన్ అంచనాలను మించినట్లే కనిపిస్తోంది.
హిందీలో మరీ బిగ్ రిలీజ్ ఏమీ కాకపోయినా.. ప్రదర్శిస్తున్న తక్కువ షోలకు రెస్పాన్స్ బాగున్నట్లే కనిపిస్తోంది. అఖండలో హిందూ ఆలయాలు, హిందూ ధర్మం గురించి గొప్పగా చెప్పిన నేపథ్యంలో ఉత్తరాది జనాలు ఇలాంటి వాటికి బాగా కనెక్టయిపోతున్నారు ఈ మధ్య.
భాజపా మద్దతుదారులు ఇలాంటి సినిమాలను భుజాలకెత్తి మోస్తున్నారు. ‘కార్తికేయ-2’కు కూడా అదే కలిసొచ్చింది. హిందీలో ఈ ఫ్యాక్టరే ‘అఖండ’ సినిమాకు ప్లస్ అవుతుందని ముందు నుంచి అంచనా వేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ విషయమే రుజువవుతోంది. ఇంత లేటుగా రిలీజై కూడా ఇలాంటి స్పందన తెచ్చుకోవడం విశేషమే.
This post was last modified on January 21, 2023 2:48 pm
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…
సంక్రాంతి పండక్కు తెలుగు రాష్ట్రాల థియేటర్లకు ఊహించిన సమస్యే తలెత్తింది. షోలు చాలక ప్రేక్షకుల డిమాండ్ అధికం కాగా దానికి…
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…