సరైన కారణం ఏమీ ఉండదు.. ఏదో ఒక చిన్న కామెంట్‌ను పట్టుకుని గొడవ చేస్తారు. ఎన్నో ఏళ్ల ముందు చేసిన కామెంట్లను కూడా ఇప్పుడు తెరపైకి తెచ్చి నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తారు. సినిమాతో ఏమాత్రం సంబంధం లేని విషయాలపై కాంట్రవర్శీ రాజేసి సినిమాను బాయ్‌కాట్ చేద్దాం అంటారు. ఏడాది కాలంగా సోషల్ మీడియాలో ఒక వర్గం సినిమా బాయ్‌కాట్ పేరుతో చేస్తున్న ఆగడాలు అన్నీ ఇన్నీ కావు.
‘లాల్ సింగ్ చడ్డా’ సహా పలు చిత్రాలను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో రోజుల తరబడి నెగెటివిటీని స్ప్రెడ్ చేసి ఆ సినిమాలను దెబ్బ తీయడం చర్చనీయాంశంగా మారింది. పూర్తిగా ఒక సినిమాను వీళ్లు కిల్ చేసేస్తారని చెప్పలేం కానీ.. అదే పనిగా నెగెటివిటీ స్ప్రెడ్ చేయడం ద్వారా కొంత మేర డ్యామేజ్ అయితే చేయగలిగారు. వీళ్లను ఎలా డీల్ చేయాలో తెలియక తలలు పట్టేసుకున్నారు బాలీవుడ్ ప్రముఖులు. వీళ్ల తీరును ఖండించి, విభేదించిన వాళ్ల సినిమాలను సైతం టార్గెట్ చేయడం గమనార్హం.
ఐతే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఏదో ఒక దశలో మార్పు తప్పదు. ఇప్పుడు అదే జరుగుతోంది. కొన్ని నెలల నుంచి అదే పనిగా షారుఖ్ ఖాన్ సినిమా ‘పఠాన్’ను టార్గెట్ చేస్తూ వచ్చిన బాయ్‌కాట్ బ్యాచ్‌కు ఇప్పుడు ప్రేక్షకులే బుద్ధి చెబుతున్నారు. హీరోయిన్ దీపికా పదుకొనే కాషాయ డ్రెస్ వేసుకుని ఎక్స్‌పోజింగ్ చేసిందనే సిల్లీ రీజన్‌తో ఆ సినిమాను కొన్ని వారాల పాటు టార్గెట్ చేయడం.. చివరికి ఆ పాటను ఎడిట్ చేసుకోవాల్సిన పరిస్థితిని చిత్ర బృందానికి కల్పించడం సామాన్య ప్రేక్షకుల్లో సానుభూతి పెంచినట్లు కనిపిస్తోంది. అందుకే బాయ్‌కాట్ బ్యాచ్ పీచమణిగేలా ఈ సినిమాకు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్ ఇస్తున్నారు.
రికార్డు స్తాయిలో టికెట్లు తెగుతుండడంతో ‘పఠాన్’కు ఓపెనింగ్స్ మామూలుగా ఉండబోవని అర్థమవుతోంది. సినిమాకు టాక్ బాగుంటే షారుఖ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కావడం లాంఛనమే అనిపిస్తోంది. ఈ దెబ్బతో బాయ్‌కాట్ బ్యాచ్‌కు దాదాపుగా కాలం చెల్లినట్లే కనిపిస్తోంది. ఇక ఏ సినిమాను వాళ్లు టార్గెట్ చేసినా ప్రేక్షకులు ఊరుకునేలా లేరు. కాబట్టి బాలీవుడ్ బెంగ తీరినట్లే భావించవచ్చు.
This post was last modified on January 20, 2023 6:46 pm
ఇంకో మూడు రోజుల్లో జైలర్ 2 విడుదల కానుంది. నైజామ్ అడ్వాన్స్ బుకింగ్ మొదలైపోయింది. సూపర్ స్టార్ రజినీకాంత్ బ్లాక్…
ఎవరి జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చెప్పలేం. ఫేమ్ లేనపుడు చేసే కొన్ని పనులు.. తర్వాత అనుకోని ఇబ్బందిగా…
రాజమౌళి కెరీర్‌ను అతి పెద్ద మలుపు తిప్పిన సినిమాగా అందరూ ‘బాహుబలి’నే చెబుతారు. ఆయన కెరీర్‌ను ‘బాహుబలి’కి ముందు, తర్వాత…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీ క్లిన్ స్వీప్ చేయాలి. ఆ దెబ్బతో గొడ్డలి పార్టీ మూత పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు…
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలని పెద్దలు అంటారు. పెళ్లి, పిల్లలు ఏదైనా సరే ఏజ్ బార్…
సినిమా కుటుంబాల నుంచి వారసులు ఇండస్ట్రీలోకి రావడం చాలా మామూలు విషయం. ఐతే ఒక కుటుంబంలో తండ్రి హీరోగా, తల్లి…