Movie News

మహేష్ 29.. పక్కా ఇంటర్నేషనల్

‘బాహుబలి’ తర్వాత రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ ఎవ్వరూ ఊహించని విధంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు రేపింది. ‘బాహుబలి’ని పెద్దగా పట్టించుకోని ఇంటర్నేషనల్ ఆడియన్స్.. ఈ సినిమాకు మామూలుగా కనెక్టవలేదు. ముఖ్యంగా నేటివ్ అమెరికన్స్, హాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఈ సినిమా చూసి ఫిదా అయిపోయారు. ప్రపంచ మేటి ఫిలిం మేకర్స్ రాజమౌళిని ఎలా ఆకాశానికెత్తేస్తున్నారో తెలిసిందే. తర్వాత ఆయన తీసే సినిమా కోసం వాళ్లంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో జక్కన్నకు చాలా పెద్ద మార్కెట్టే క్రియేటైంది. మహేష్ బాబుతో ఆయన చేయబోయే సినిమాకు ఆకాశమే హద్దు అనడంలో సందేహం లేదు. కాబట్టి ఇప్పటిదాకా తీసిన సినిమాలన్నింటికీ మించి దీనిపై జక్కన్న ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. జక్కన్న ఆ పనిలోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది.

గత కొన్ని నెలల నుంచి ఓవైపు మహేష్ సినిమా కోసం స్క్రిప్టు రెడీ చేస్తూనే.. ప్రి ప్రొడక్షన్ పనులు, కాస్టింగ్ కోసం భారీ ప్రణాళికలే వేస్తున్నాడు జక్కన్న. కాస్టింగ్ ఇతర అవసరాల కోసం క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ (సీసీఏ)తో రాజమౌళి ఇప్పటికే ఒప్పందం చేసుకున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా ధ్రువీకరించాడు.

మహేష్‌తో తాను చేయబోయే సినిమాకు అంతర్జాతీయ ఆర్టిస్టుల అవసరం పడుతుందని.. అలాగే గ్రాషిక్స్, ఇతర అవసరాలకు ప్రొఫెషనల్స్‌ను ఎంచుకునేందుకు గాను ‘సీసీఏ’తో ఒప్పందం జరిగిందని.. ఆ దిశగా ఆ సంస్థతో తన టీం పని చేస్తోందని తెలిపాడు జక్కన్న. దీన్ని బట్టి చూస్తుంటే.. ఇప్పటిదాకా తన సినిమాలకు ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ సాయం తీసుకున్నప్పటికీ, మహేష్ సినిమాకు మరింత ప్రొఫెషనల్‌గా వెళ్లబోతున్నాడని.. హాలీవుడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్ల తోడ్పాటుతూ దీన్ని పక్కా ఇంటర్నేషనల్ మూవీగా తీర్చిదిద్దబోతున్నాడని.. ఇది మరో స్థాయి సినిమా అని పక్కాగా అర్థమవుతోంది. జక్కన్నతో మహేష్ సినిమా ఆలస్యం అయితే అయింది కానీ.. ఒకేసారి కుంభస్థలాన్ని కొట్టబోతున్నారన్నది స్పష్టం.

This post was last modified on January 20, 2023 5:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మాస్ రాజా మళ్లీ ఖాకీ తొడిగాడండోయ్

మాస్ ఇమేజ్ తెచ్చుకున్న ప్రతి హీరో కెరీర్లో ఒక్కసారైనా పోలీస్ పాత్ర చేయాలని అనుకుంటాడు. ఆ పాత్రల్లో ఉండే హీరోయిజం…

50 minutes ago

‘పద్మ’ పురస్కారాలను అందుకోనున్న తెలుగువారు వీరే…

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయా రంగాల్లో విశేష ప్రతిభ కనబరచిన వారికి పద్మ అవార్డులను కేంద్ర ప్రభత్వం ప్రకటించిది.…

1 hour ago

బాలకృష్ణ కీర్తి కిరీటంలో ‘పద్మభూషణ్’

నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. దశాబ్దాలుగా కంటున్న కల నిజమయ్యింది. బాలకృష్ణకు ప్రతిష్టాత్మక పద్మభూషణ్…

2 hours ago

ప్రియాంక అంటే ఎందుకంత టెన్షన్

మహేష్ బాబు 29లో ప్రియాంకా చోప్రా ఫైనల్ అయినప్పటి నుంచి సోషల్ మీడియా ఫ్యాన్స్ ఖంగారు పడుతున్నారు. ఎందుకంటే ఆమెనే…

2 hours ago

కలెక్షన్లు….పోస్టర్లు….ఇది ఇప్పటి కథ కాదు !

ఇటీవలే టాలీవుడ్ అగ్ర నిర్మాతల మీద ఐటి శాఖ దాడులు జరిగిన తర్వాత అధిక శాతం వినిపిస్తున్న మాట ప్రొడ్యూసర్లు…

2 hours ago

జగన్ విశ్వసనీయత కోల్పోయారు: వైఎస్ షర్మిల

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన…

4 hours ago