మంచు మనోజ్ ఒకప్పుడు టాలీవుడ్లో బాగా యాక్టివ్‌గా ఉన్న యువ కథానాయకుల్లో ఒకడు. ‘దొంగ దొంగది’ సినిమాతో హీరోగా పరిచయం అయిన దగ్గర్నుంచి విరామం లేకుండా సినిమాలు చేశాడు. ఒక టైంలో ఏడాదికి రెండు సినిమాలు కూడా రిలీజ్ చేశాడు. అలాంటి హీరో నుంచి ఐదేళ్లకు పైగా ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాకపోవడం అనూహ్యం. మనోజ్ చివరి సినిమా ‘ఒక్కడు మిగిలాడు’ 2017 చివర్లో విడుదలైంది. ఆ తర్వాత ఒకట్రెండు సినిమాల్లో అతిథి పాత్రలు చేశాడే తప్ప హీరోగా ఒక్క సినిమా కూడా చేయలేదు మనోజ్.
రెండేళ్ల కిందట ఒక సినిమాకు కమిటై.. ఆ తర్వాత ఆ సినిమాను ఘనంగా అనౌన్స్ చేయడం తెలిసిందే. ‘ఎంఎం ఆర్ట్స్’ అంటూ సొంతంగా బేనర్ పెట్టుకుని శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడితో మనోజ్ మొదలుపెట్టిన ఆ చిత్రమే.. అహం బ్రహ్మాస్మి. దీన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించనున్నట్లు ఘనంగా ప్రకటించి ఆ తర్వాత దాని ఊసే ఎత్తలేదు మనోజ్.
‘అహం బ్రహ్మాస్మి’ ఆగిపోయినట్లు మనోజ్.. ఈ మధ్య వేసిన ఒక ట్వీట్‌తో అర్థమైంది జనాలకు. కాగా మనోజ్ ఇప్పుడు కొత్తగా మరో సినిమాను అనౌన్స్ చేశాడు. ఆ చిత్రమే.. వాట్ ద ఫిష్. దీనికి ‘మనం మనం బరంపురం’ అంటూ క్రేజీ క్యాప్షన్ కూడా పెట్టాడు మనోజ్. ఈ సినిమా టైటిల్, ప్రి లుక్, క్యాప్షన్ అన్నీ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. మనోజ్ ఒక క్రేజీ రైడ్‌కు రెడీ అవుతున్నట్లే అనిపిస్తోంది. ఈ చిత్ర దర్శకుడి అసలు పేరేంటో ఏమో కానీ.. పోస్టర్ మీద మాత్రం జస్ట్ ‘వి’ అని వేశారు. మనోజ్ సొంత బేనర్లోనే ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రి లుక్ పోస్టర్‌తో మనోజ్ బాగానే జనాల దృష్టిని ఆకర్షించగలిగాడు.
మళ్లీ అతను ‘నేను మీకు తెలుసా’.. ‘మిస్టర్ నూకయ్య’ రోజులకు అభిమానులను తీసుకెళ్లాడనే చెప్పాలి. ఆ సినిమాలు కూడా చాలా క్రేజీగా అనిపిస్తూ జనాల దృష్టిని ఆకర్షించాయి. ఫైనల్ రిజల్ల్ ఎలా ఉన్నప్పటికీ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్నాయి. కాకపోతే ఇప్పుడు మనోజ్ మార్కెట్ బాగా దెబ్బ తినేసి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అతడి సినిమా కోసం జనాలకు థియేటర్లకు రప్పించడం అంత తేలిక కాదు. ముందు ‘అహం బ్రహ్మాస్మి’లాగా ఆరంభ శూరత్వానికి పరిమితం కాకుండా.. సినిమాను ముందుకు తీసుకెళ్లడం ముఖ్యం. మనోజ్ ఈసారి చేతులెత్తేయడని ఆశిద్దాం.
This post was last modified on January 20, 2023 5:04 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…