మంచు ఫ్యామిలీ తీసే సినిమాలు వాటిలో కంటెంట్ గురించి ఎన్ని కామెంట్లు ట్రోలింగులు జరిగినా అభిమానులకు సగటు సినీ ప్రేక్షకులకు మనోజ్ అంటే మంచి గౌరవమే ఉంది. విష్ణు లాగా తొందరపడి చేసేయడం ఆపై డిజాస్టర్లు రుచి చూడటం లాంటి వాటికి దూరంగా ఉంటున్నా ఫ్యాన్స్ మాత్రం తన నుంచి సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.
గత రెండు రోజులుగా మీకో శుభవార్త చెబుతానంటూ మనోజ్ ట్విట్టర్ లో తెగ ఊరిస్తున్నాడు. వ్యక్తిగత జీవితంలో అతని మొదటి పెళ్లి విడాకులకు వెళ్లిపోయింది కాబట్టి ఇప్పుడిది రెండో వివాహం గురించేనని అందరూ అనుకున్నారు.
దానికి తగ్గట్టే గత కొంత కాలంగా మనోజ్ బయట కొన్ని ఈవెంట్స్ లో ఓ దివంగత రాజకీయ నాయకుడి కూతురితో కలిసి హాజరు కావడంతో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరింది. అయితే అనూహ్యంగా మనోజ్ మ్యారేజ్ గురించి కాకుండా తన కొత్త ప్రాజెక్టు గురించి అనౌన్స్ మెంట్ ఇచ్చి షాక్ కి గురి చేశాడు.
వాట్ ది ఫిష్ టైటిల్ తో రూపొందబోయే యాక్షన్ క్రైమ్ డ్రామా ద్వారా కొత్త దర్శకుడు వరుణ్ కోరుకొండతో చేతులు కలుపుతున్నాడు. సిక్స్ సినిమాస్, ఏ ఫిలిం బై బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మనోజ్ ఛీట్ చేసినా ఇదంతా ట్విట్టర్ లో ట్రెండింగ్ కావడం గమనార్హం.
మనోజ్ చివరిసారి ఫుల్ లెన్త్ హీరోగా నటించిన సినిమా ఒక్కడు మిగిలాడు. వచ్చి ఆరేళ్ళు అవుతోంది. అప్పటి నుంచి మేకప్ కి దూరంగా ఉన్నాడు. విష్ణు, లక్ష్మి ప్రసన్నలు ఈ గ్యాప్ లో చాలా తీశారు కానీ తమ్ముడు మాత్రం సెట్లకు దూరంగా వేరే ప్రపంచంలో ఉన్నాడు.
మోహన్ బాబు నట వారసత్వం బలంగాగా నిలబలేకపోయిందనే కామెంట్స్ నేపథ్యంలో మనోజ్ కాస్త గట్టిగా మనసు చేసుకుని వరసగా సినిమాలు చేస్తే జనాలు ఆదరిస్తారని ఫ్యాన్స్ అంటున్నారు. పెళ్లి విషయంలో ఇప్పటికి దాటవేసినా ఆ గుడ్ న్యూస్ కూడా త్వరలోనే ఉండొచ్చని మంచు కాంపౌండ్ ఇన్ సైడ్ టాక్
This post was last modified on January 20, 2023 12:15 pm
యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల వారసుడు రోషన్ కనకాల నటించిన మోగ్లీకి ఎదురీత తప్పడం లేదు. అఖండ తాండవం…
ఇంకో అయిదు రోజుల్లో అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ విడుదల కాబోతోంది. మాములుగా అయితే ఈపాటికి అడ్వాన్స్ ఫీవర్…
40 % ఓటు బ్యాంకు గత ఎన్నికల్లో వచ్చిందని చెబుతున్న వైసిపికి అదే ఓటు బ్యాంకు నిలబడుతుందా లేదా అన్నది…
ఇంకో ఇరవై నాలుగు రోజుల్లో సంక్రాంతి హడావిడి మొదలైపోతుంది. ఒకటి రెండు కాదు స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి ఈసారి ఏకంగా…
అఖండ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో తమన్ మాటలు చర్చకు దారి తీస్తున్నాయి. ఇండస్ట్రీలో యూనిటీ లేదని,…
ఎవరో జ్వాలలు రగిలించారు, వేరెవరో దానికి బలి అయ్యారు అంటూ ఒక పాత పాట ఉంటుంది. ఎన్ని తరాలు మారినా…