టాలీవుడ్ యువ దర్శకుడు వంశీ పైడిపల్లి మీద ‘వారసుడు’ సినిమా విడుదలకు ముందు జరిగిన ట్రోలింగ్ అంతా ఒకెత్తయితే.. రిలీజ్ తర్వాత ఒక ఇంటర్వ్యూ వీడియో క్లిప్ వైరల్ అయ్యాక జరుగుతున్న ట్రోలింగ్ ఇంకో ఎత్తు. ఈ సినిమా రకరకాల కారణాల వల్ల సోషల్ మీడియాలో ట్రోలర్లకు పెద్ద కంటెంట‌్‌గా మారింది. ముఖ్యంగా ‘వారసుడు’ ట్రైలర్ చూశాక జనాలు కౌంటర్ల మీద కౌంటర్లు వేశారు. చాలా తెలుగు సినిమాలను మిక్సీలో కొట్టి ఈ సినిమా తీసినట్లుగా అనిపించడమే అందుక్కారణం. ఇక సినిమా రిలీజ్ తర్వాత ఇటు తెలుగువాళ్లు, అటు తమిళ జనాలు కలిపి వంశీని టార్గెట్ చేస్తున్నారు.
ఒక తమిళ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వంశీ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే తెర తీశాయి. తన సినిమాను సీరియల్‌తో పోల్చడం పట్ల వంశీ తీవ్రంగా స్పందించాడు. తాము ఒక సినిమా కోసం ఎంత కష్టపడతామో తెలుసా.. ఇంత కష్టపడి తీసే సినిమాను ఎలా ట్రోల్ చేస్తారు.. సీరియల్ అంటారు అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించాడు వంశీ.
ఐతే ఎలాంటి సినిమా తీసినా విమర్శించకుండా చూడాల్సిందే అనడం ఎంత వరకు కరెక్ట్ అనే ప్రశ్నలను నెటిజన్లు సంధిస్తూ వంశీని మళ్లీ ట్రోల్ చేస్తున్నారు. సినిమా కోసం అందులో పని చేసేవాళ్లు ఎంత కష్టపడతారో.. వివిధ రంగాల వాళ్లు అలాగే కష్టపడతారని.. కేవలం సినిమా వాళ్లదే కష్టం అనుకోవడం పొరబాటని అంటున్నారు. కష్టపడి తీశాం కాబట్టి తాము ఏం తీస్తే అది చూడాలనడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు.
ఒక నెటిజన్.. “నేనొక హోటల్‌కు వెళ్లి ఇడ్లీ ఆర్డర్ చేశాను. అతను చద్ది ఇడ్లీ, పాచిపోయిన చట్నీ పెట్టారనుకుందాం. డబ్బులు పెట్టి టిఫిన్ తినే నేను అతణ్ని ఇదేంటని ప్రశ్నించకూడదా” అని వంశీని ఉద్దేశించి పరోక్షంగా కౌంటర్ వేశాడు. డబ్బులు పెట్టి థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు క్వాలిటీ ప్రాడక్ట్ అందించాల్సిన బాధ్యత మేకర్స్‌దే అని.. పాత సినిమాలను తిప్పి తిప్పి కొట్టి రొటీన్ వంట వడ్డించి తాము కష్టపడ్డాం, ఏ విమర్శా చేయకండి అనడం ఎంత వరకు సబబు అని నెటిజన్లు వంశీని ఒక రేంజిలో ట్రోల్ చేస్తున్నారు మరోసారి.
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…