తెలుగు సినిమాల వరకు ఈసారి సంక్రాంతి రేసులో ముందు వచ్చింది ‘వీరసింహారెడ్డి’నే. 11న తమిళ అనువాద చిత్రం ‘తెగింపు’ రిలీజ్ కాగా.. మరుసటి రోజు బాలయ్య సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. బాలయ్య చివరి సినిమా ‘అఖండ’తో పోలిస్తే ‘వీరసింహారెడ్డి’ తొలి రోజు రెట్టింపు వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. అది చూసి అందరూ బలుపు అనుకున్నారు కానీ.. తర్వాతే తెలిసింది వాపు అని.
శుక్రవారం ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్‌తో రెండో రోజు ఒక్కసారిగా థియేటర్లు తగ్గిపోయింది. ప్రేక్షకులకు ఇంకో మంచి ఆప్షన్ దొరికింది. ఇక అంతే.. ‘వీరసింహారెడ్డి’ జోరు ఒక్కసారిగా తగ్గిపోయింది. తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వరకు శుక్రవారం వసూళ్లలో బిగ్ డ్రాప్ కనిపించింది. ‘వీరసింహారెడ్డి’ తొలి రోజు ఎలా జోరు చూపించిందో.. ‘వాల్తేరు వీరయ్య’ కూడా డే-1 అలాగే దూకుడు చూపిస్తోందని.. శనివారానికి రెండు సినిమాలూ సమానం అయిపోతాయని అనుకున్నారు.
కానీ అలా జరగలేదు. వాల్తేరు వీరయ్య ఏ దశలోనూ జోరు తగ్గించలేదు. నిలకడగా వసూళ్లు సాధిస్తూ బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేసింది. కానీ ‘వీరసింహారెడ్డి’ మాత్రం వసూళ్లు ఒకసారి ఒక స్థాయికి డ్రాప్ అయ్యాక అక్కడి నుంచి పుంజుకోలేదు. బి, సి సెంటర్లలో ఈ సినిమా వీకెండ్ తర్వాత కూడా మంచి వసూళ్లే రాబట్టింది కానీ.. ‘వాల్తేరు వీరయ్య’లా అన్ని చోట్లా నిలకడను చూపించలేకపోయింది. బి, సి సెంటర్లలో కూడా ‘వాల్తేరు వీరయ్య’తో పోలిస్తే ‘వీరసింహారెడ్డి’ వసూళ్లు తక్కువే.
థియేటర్లు తగ్గించేయడం, సరైన స్క్రీన్లు ఇవ్వకపోవడం వల్ల బాలయ్య సినిమాకు అన్యాయం జరిగిందన్న అభిమానుల్లో ఆక్రోశంలో కొంత నిజం లేకపోలేదు. కానీ అధిక డిమాండ్ ఉన్న చిరంజీవి సినిమాకు ఎక్కువ స్క్రీన్లు, షోలు నిలవడం మరిచిపోకూడదు. తొలి రోజు వేరే ఆప్షన్ లేక జనాలు ‘వీరసింహారెడ్డి’ని విరగబడి చూడడం.. బాలయ్య కెరీర్లోనే అత్యధిక రిలీజ్ దక్కడం వల్ల ఆ సినిమాకు అనూహ్యమైన వసూళ్లు వచ్చాయి. అది ఓవరాల్ వసూళ్లకు, రిజల్ట్‌కు కలిసొచ్చింది. అలా కాకుండా శుక్రవారం ‘వాల్తేరు వీరయ్య’తో పాటే రిలీజై ఉంటే మాత్రం సినిమా రిజల్ట్ వేరుగా ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే బాలయ్య ముందొచ్చి మంచి పని చేశాడు.
This post was last modified on January 19, 2023 7:56 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…