తమ్ముడి కోసం రానా పాట్లు

దగ్గుబాటి ఫ్యామిలీ నుండి వెంకటేష్ , రానాలు హీరోలుగా వచ్చారు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుండి మరో హీరో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. సురేష్ బాబు తనయుడు ,రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ తేజ డైరెక్షన్ లో ‘అహింస’ అనే సినిమాతో పరిచయం అవ్వబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయింది. ఆర్పీ సాంగ్స్ సినిమాపై కొంత బజ్ తెచ్చాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి రావాల్సినంత ఎటెన్షన్ మాత్రం రావడం లేదు. అందుకే ఈ సినిమాపై రానా స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట.

రిలీజ్ డేట్ , ప్రమోషన్స్ అన్నీ రానా డిసైడ్ చేయాల్సిందేనట. ప్రస్తుతం తమ్ముడి సినిమా కోసం నాన్నతో కలిసి బెస్ట్ రిలీజ్ డేట్ సెలెక్ట్ చేసే పనిలో ఉన్నాడట రాణా. తాజాగా ట్రైలర్ ను తన స్నేహితుడు రామ్ చరణ్ తో సోషల్ మీడియాలో రిలీజ్ చేయించాడు రానా. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఇంకా కొందరు తన ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొనున్నాడు. ఈవెంట్ కి కూడా ఓ బిగ్ సెలిబ్రిటీ ను తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నాడు రానా .

ఇప్పటికే రాణా కొందరికి సినిమా చూపించి వారి నుండి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకున్నాడట. నిజానికి ప్రొడక్షన్ ఆనంది ఆర్ట్స్ అయినప్పటికీ సురేష్ బాబు , రానా ఈ సినిమాకు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా అభిరామ్ ‘అహింస’ సినిమా విషయంలో సురేష్ బాబు కంటే రానానే కేర్ ఎక్కువ తీసుకుంటున్నాడట. ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి లో ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది.