Movie News

టికెట్ రేట్లు తగ్గిస్తేనే కలెక్షన్లు పెరిగేది

పండగ అయిపోయినా టికెట్ రేట్లు మాత్రం జీవో ప్రకారం పెంచినవే ఉండటంతో చాలా చోట్ల సంక్రాంతి సినిమాల కలెక్షన్లలో విపరీతమైన డ్రాప్ కనిపిస్తోంది. ఇది మంచి పరిణామం కాదు. మొదటి నాలుగైదు రోజులంటే క్రేజ్, ఫ్యాన్స్ ఉత్సాహం, సెలవుల సందడి కాబట్టి ఓ నలభై యాభై ఎక్కువైనా జనం తట్టుకుంటారు. ఏపీలో కొంత నయం. పాతిక రూపాయలకే పరిమితం చేశారు. తెలంగాణలో పెరిగిన వంద ఇంకా అలాగే ఉంది. కానీ ఇప్పుడు కూడా కొనసాగించడం లాంగ్ రన్ ని దెబ్బ తీస్తుందని వసూళ్ల తగ్గుదల సాక్ష్యంగా నిలుస్తోంది. ఇంకో వీకెండ్ ని క్యాష్ చేసుకునే ఉద్దేశంతో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు మౌనంగా ఉన్నారు.

మూవీ లవర్స్ డే పేరిట పివిఆర్ మల్టీప్లెక్స్ యాజమాన్యం జనవరి 20న టికెట్ కేవలం 99 రూపాయలకే అమ్ముతామని ఏ సినిమా అయినా ఇదే ఉంటుందని ప్రకటించింది. తీరా చూస్తే సీన్ ఇంకోలా ఉంది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు హైదరాబాద్ కు సంబంధించి అసలు రేపటి బుకింగ్సే పివిఆర్ వి చూపించడం లేదు. కనీసం రెండు రోజుల ముందైనా పెట్టకపోతే ఎలా అనేది సగటు కామన్ పబ్లిక్ ప్రశ్న. మిగిలిన వాటిలో హైక్ ఇచ్చిన 295 చూపిస్తోంది. ఇది ఎప్పటిదాకా ఉంటుందో క్లారిటీ లేదు. పూర్తిగా సినిమా చల్లారేదాకాన లేక ఆర్ఆర్ఆర్ తరహాలో ఫైనల్ డే వరకు ఇదే పెడతారానేది అంతు చిక్కడం లేదు.

అసలే ఓటిటిలు భారీ సినిమాల షూటింగులు జరుగుతున్న టైంలోనే మేము ఫలానా ప్రాజెక్టు హక్కులు కోనేసాం చూడండంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తుంటే క్షేత్ర స్థాయిలో మాత్రం ఇలా వారాల తరబడి టికెట్ రేట్లను అదుపులో పెట్టలేకపోవడం బడా స్టార్లను పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. సగటు మిడిల్ క్లాస్ పర్సుని ఇలా పెద్ద బడ్జెట్ చిత్రాలే భోజనం చేస్తే మీడియం రేంజ్ హీరోలవి వచ్చినప్పుడు ఆడియన్స్ లైట్ తీసుకుంటారు. అలా కాకుండా ఆలస్యంగా చూద్దామని ఎదురు చూస్తున్న ప్రేక్షకుల కోసం వీలైనంత త్వరగా సాధారణ రేట్లు తీసుకురావడం అవసరం.

This post was last modified on January 19, 2023 1:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం: మానవ తప్పిదమే..

2021 డిసెంబర్ 8న త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ-17 వీ5 హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరులో కూలిపోయిన…

2 hours ago

గేమ్ ఛేంజర్ : అబ్బాయి కోసం బాబాయ్?

2024 మెగా ఫ్యామిలీ బాగానే కలిసొచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవడం ఆ కుటుంబంలో ఎప్పుడూ లేనంత పండగ…

2 hours ago

పశ్చిమగోదావరిలో దారుణం: పార్శిల్‌లో మృతదేహం

పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో దారుణం వెలుగుచూసింది. ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో ఇల్లు నిర్మిస్తున్న సాగి తులసి…

2 hours ago

అసెంబ్లీలో చెప్పుల ఆరోపణలు, కాగితాల తుపాన్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. ఫార్ములా ఈ-కారు రేసు వివాదం కారణంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు.…

3 hours ago

నా సినిమా ఎవ్వరూ చూడలేదు-బాలీవుడ్ లెజెండ్!

బాలీవుడ్లో గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్స్ కమ్ డైరెక్టర్లలో విధు వినోద్ చోప్రా ఒకడు. మున్నాభాయ్ సిరీస్, 3 ఇడియట్స్ లాంటి గొప్ప…

3 hours ago

హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫార్ములా ఈ-కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై…

3 hours ago