ఎప్పుడైతే ప్రకటన వచ్చిందో అప్పటి నుంచే విపరీతమైన చర్చల్లో ఉన్న మహేష్ రాజమౌళి ప్యాన్ ఇండియా ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు మొదలవుతుందానే ఆసక్తి అభిమానుల్లో అంతకంతా పెరిగిపోతోంది. ఆర్ఆర్ఆర్ కు పలు అంతర్జాతీయ పురస్కారాలు వచ్చిన సందర్భంగా ఇంటర్నేషనల్ మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో జక్కన్న దీని ప్రస్తావన తెస్తున్నారు. ఇది పదేళ్ల నుంచి పెండింగ్ ఉన్న సినిమా అని ఇప్పటికి కుదిరిందని అన్నారు. అంటే బాహుబలి కన్నా ముందే సూపర్ స్టార్ తో చేసే ప్లానింగ్ జరిగిందన్న మాట. కాకపోతే రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ ఇప్పుడు తెరకెక్కనుంది.
పలు అంతర్జాతీయ నిపుణలను బృందాలను దీని కోసం సమీకరిస్తున్న రాజమౌళి ఆస్కార్ ఈవెంట్ అయ్యాక స్క్రిప్ట్ మీద పూర్తి దృష్టి కేంద్రీకరించబోతున్నారు. రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆల్రెడీ తన టీమ్ తో ఈ పనిలో ఉండగా ఏప్రిల్ నుంచి జక్కన్న సీరియస్ గా రంగంలోకి దిగుతారు. బయట ఎస్ఎస్ఎంబి 29గా నెంబర్ చెబుతున్నారు కానీ దానికన్నా ముందు మహేష్ మరొక సినిమా చేసే అవకాశం లేకపోలేదు. అయిదు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందనున్న జక్కన్న కాంబో కోసం ఎంతలేదన్నా రెండు మూడేళ్లు హీనపక్షం అవసరమవుతుంది కాబట్టి మహేష్ నుంచి ఇంకో మూవీ రావొచ్చు.
ఇండియానా జోన్స్ తరహాలో ఫారెస్ట్ అడ్వెంచర్ అని ముందు నుంచి ఊరిస్తున్నారు సో జానర్ కు సంబంధించి క్లారిటీ వచ్చేసినట్టే. కీరవాణి స్వరాలు కూర్చే పనిని త్వరలో మొదలు పెట్టబోతున్నారు. అడవి నేపథ్యంలో మహేష్ చేసిన చిత్రం టక్కరి దొంగ ఒకటే. కమర్షియల్ గా పెద్దగా ఆడకపోయినా ఫ్యాన్స్ దీని మేకింగ్ స్టైల్ ని ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పుడు జక్కన్న తీయబోయే విజువల్ వండర్ కి వాళ్ళే కాదు సగటు మూవీ లవర్స్ సైతం ఉక్కిరిబిక్కిరి కావడం సహజం. హీరోయిన్ ఇతర సాంకేతిక బృందం తదితరాలు ఇంకా ఫైనల్ చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి లీక్సేమీ రాలేదు.
This post was last modified on January 19, 2023 1:38 pm
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…