ఎన్నో మార్పులు వచ్చాయి, ప్రేక్షకులు కొత్తగా ఆలోచిస్తున్నారని ఏదేదో అనుకుంటాం కానీ పండగలకు వచ్చేటప్పటికీ ఈ సూత్రం పూర్తిగా పక్కకెళ్లిపోతుంది. ప్రతి సంక్రాంతి దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. వాల్తేరు వీరయ్యలో విషయం తక్కువన్నారు. కట్ చేస్తే వారం దాటకుండానే ఇండియాలో ఓవర్సీస్ లో వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. వీరసింహారెడ్డి గతంలో చూసిందే కదాని కామెంట్ చేశారు. నేనేం తీసిపోలేదన్న రీతిలో వంద కోట్ల గ్రాస్ మైలురాయిని అందుకుంది. పక్క రాష్ట్రం తమిళనాడులో వరిసు ఏకంగా 150 కోట్లను దాటేసి వామ్మో అనిపించుకుంది. తునివు తేలికగా సెంచరీ కొట్టేసి ఇంకా స్ట్రాంగ్ గా ఉంది.
ఇక్కడో విషయం గమనించాలి. ఇవన్నీ రెగ్యులర్ కంటెంట్ తో రూపొందినవే. గతంలో చూడని కొత్త స్టోరీలు గట్రా ఏమీ ఉండవు. కానీ స్టార్ పవర్ వీటిని కాచుకుంది. దర్శకులు చేసిన తప్పులు లోపాలను కప్పెట్టేసింది. తమ ఇమేజ్ తో జనాన్ని థియేటర్లకు రప్పించగల చిరంజీవి, బాలకృష్ణ, విజయ్, అజిత్ లు ఓ మోస్తరుగా ఉందన్న టాక్ తోనూ కలెక్షన్ల వర్షం కురిపించారు. మరీ డిజాస్టర్ అనిపించుకునే స్థాయిలో ఇవేవీ లేకపోవడం ఆయా భాషల్లో జెండా పాతేలా చేశాయి. వారసుడు, తెగింపులు మన దగ్గరేం అద్భుతాలు చేయలేదు. వాల్తేరు వీరయ్యని అంత పెద్ద రిలీజ్ ఇచ్చినా హిందీలో ఎవరూ పట్టించుకోలేదు.
వీటిని బట్టి అర్థం చేసుకోవాల్సింది సరైన రీతిలో ఈ స్టార్ పవర్ ని వాడుకుంటే బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయొచ్చు. ఇప్పుడంతా ఎలివేషన్ల జమానా. కెజిఎఫ్, విక్రమ్, అఖండ లాంటివి అంత బ్రహ్మాండంగా ఆడాయంటే వాటిలో హీరోయిజం చూపించిన తీరు, సంగీత దర్శకులు తమ బిజిఎంతో సన్నివేశాలను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిన విధానం జనానికి కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు సంక్రాంతి సినిమాలకూ అదే జరిగింది. డీసెంట్ గా అనిపించే కథాకథనాలు ఉంటే చాలు హీరోలు ఈజీగా గట్టెక్కిస్తున్నారు. ఆ విషయంలో దర్శకులు జాగ్రత్త పడాల్సిందే. ఫలితాలు ఆచార్యలా వీరయ్యలా అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంది.
This post was last modified on January 18, 2023 1:55 pm
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…