Movie News

ర‌జినీకాంత్‌కు విల‌న్‌గా సునీల్

క‌మెడియ‌న్‌గా వైభ‌వం చూస్తున్న రోజుల్లో హీరోగా మారి.. అందాల రాముడు, మ‌ర్యాద రామ‌న్న‌, పూల‌రంగ‌డు లాంటి హిట్ల‌తో మంచి ఊపులోనే సాగాడు సునీల్. కానీ ఆ త‌ర్వాత మాస్ హీరోగా ఎదిగిపోదామ‌ని ట్రై చేసి వ‌రుస‌గా ఎదురు దెబ్బ‌లు తిన్నాడు. ఒక ద‌శ‌లో ఇటు హీరోగా సినిమాలు వ‌ర్క‌వుట్ కాక‌.. అటు క‌మెడియ‌న్‌గా మ‌ళ్లీ క్లిక్ కాలేక బాగా ఇబ్బంది ప‌డ్డాడు సునీల్.

హీరోగా చేశాక కామెడీ ఇమేజ్ దెబ్బ తిన‌డం అత‌డికి చేటు చేసింది. ఇండ‌స్ట్రీలో త‌న‌కున్న మంచి పేరు, ప‌రిచ‌యాల వ‌ల్ల అవ‌కాశాల‌కైతే లోటు లేకపోయింది కానీ.. అత‌డి క్యారెక్ట‌ర్లే క్లిక్ కాలేదు కొంత కాలం పాటు. అలాంటి టైంలోనే సీరియ‌స్ విల‌న్ పాత్ర‌ల వైపు మ‌ళ్లాడు సునీల్. మొద‌ట్లో అవి కూడా తేడా కొట్టినా.. నెమ్మ‌దిగా జ‌నాలు ఆ పాత్ర‌ల‌కు అల‌వాటు ప‌డ్డారు. క‌ల‌ర్ ఫొటో, పుష్ప సినిమాల‌తో సునీల్‌కు విల‌న్‌గా మంచి పేరే వ‌చ్చింది.

ఇప్పుడు నెగెటివ్ రోల్స్‌లో కెరీర్ పీక్స్‌ను అందుకుంటున్నాడు సునీల్. అత‌ను సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ సినిమాలో విల‌న్ పాత్ర చేస్తుండ‌డం విశేషం. సూప‌ర్ స్టార్ ప్ర‌స్తుతం జైల‌ర్ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. డాక్ట‌ర్, బీస్ట్ చిత్రాల ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్ కుమార్ స‌న్ పిక్చ‌ర్స్ బేన‌ర్లో డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది.

ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇందులో శివ‌రాజ్ కుమార్, మోహ‌న్ లాల్ లాంటి లెజెండ‌రీ న‌టులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. వీరికి సునీల్ కూడా తోడ‌య్యాడు. డిఫ‌రెంట్ గెట‌ప్, లుక్‌లో సునీల్ కొంచెం వ‌యొలెంట్‌గా క‌నిపిస్తున్న లుక్‌తో అత‌డిని ప‌రిచ‌యం చేసింది జైల‌ర్ టీం.

ఈ పోస్ట‌ర్ చూస్తే సునీల్‌ది నెగెటివ్ రోల్ అని అర్థ‌మైపోతుంది. చిత్ర వ‌ర్గాల స‌మాచారం ప్రకారం అత‌ను ప్ర‌ధాన విల‌న్ల‌లో ఒక‌డ‌ట‌. ర‌జినీ సినిమా అంటే ప‌లు భాష‌ల్లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ‌వుతుంది. ఆల్రెడీ పుష్ప‌తో వ‌చ్చిన పేరుకు.. ఈ సినిమా కూడా వ‌ర్క‌వుట్ అయితే సునీల్ రేంజే మారిపోవ‌డం ఖాయం.

This post was last modified on January 17, 2023 8:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్యామిలీకి దూరంగా.. బీసీసీఐ నిబంధనపై కోహ్లీ అసహనం!

టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ తీసుకున్న కుటుంబ పరిమితి నిబంధనలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బీసీసీఐ…

3 minutes ago

లాంఛనం పూర్తి… రాజధానికి రూ.11 వేల కోట్లు

నిజమే… నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సెలవు రోజైన ఆదివారం రూ.11 వేల కోట్ల రుణం అందింది. కేంద్ర…

30 minutes ago

అక్క బదులు తమ్ముడు… మరో వివాదంలో భూమా

టీడీపీలో భూమా ఫ్యామిలీకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు... ఒకేసారి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా కొనసాగారు. అయితే…

1 hour ago

ఎల్2….సినిమాని తలదన్నే బిజినెస్ డ్రామా

మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ వచ్చే వారం మార్చి 27 విడుదల కానుంది. ఇది ఎప్పుడో ప్రకటించారు. అయితే నిర్మాణ…

2 hours ago

కోర్ట్ – టాలీవుడ్ కొత్త ట్రెండ్ సెట్టర్

ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా, పరిచయం లేని జంటను తీసుకుని, విలన్ ని హైలైట్ చేస్తూ ఒక చిన్న బడ్జెట్…

2 hours ago

RC 16 – ఒకట్రెండు ఆటలు కాదు బాసూ

రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఉంటుందనే టాక్ ఉంది…

3 hours ago