సోషల్ మీడియా వచ్చాక అందరూ రివ్యూ రైటర్స్ అయిపోయారు. ఎవరికి తోచింది వారు పోస్ట్ చేస్తున్నారు. దీంతో కొంత మంది దర్శకులకు ఇది మింగుడు పడటం లేదు. అలాగే రివ్యూల్లో రాసే కొన్ని పోలికలు కూడా వారు తీసుకోలేకపోతున్నారు. తాజాగా వంశీ పైడిపల్లి తన సినిమాపై వస్తున్న నెగటివిటీ పై సీరియస్ అయ్యాడు. ‘వారిసు’ సినిమాకు సంబందించి సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ జరిగింది. ట్రైలర్ రిలీజ్ నుండే సినిమా గట్టి ట్రోలింగ్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
దీంతో సినిమా చూడకముందే ఒపీనియన్ చెప్పడం కరెక్ట్ కాదని , సినిమాపై తమకి నమ్మకం ఉందని మేకర్స్ చెప్పుకున్నారు. అయితే రిలీజ్ రోజు వారిసు పై గట్టి ట్రోలింగ్ జరిగింది. ఫ్యామిలీ డ్రామా సీరియల్ లా ఉందని కొందరు కామెంట్స్ చేశారు. చెన్నై మీడియాకి సంబంధించి కొన్ని రివ్యూల్లో ఎక్కువగా అదే రాసుకొచ్చారు. దీంతో వంశీ పైడిపల్లి ఓ ఇంటర్వ్యూలో వారిపై తన కోపాన్ని చూపించాడు.
అందరూ కష్టపడి సినిమా చేస్తామని , ముఖ్యంగా విజయ్ ఎంత కష్టపడ్డారో తనకే తెలుసని , డాన్సుల కోసం ఆయన చేసిన ప్రాక్టీస్ ఇంతా అంతా కాదంటూ పైడిపల్లి తన ఆవేదనను వ్యక్తపరిచాడు. తన సినిమాను సీరియల్ తో పోల్చడం తగదని , సీరియల్ ను తక్కువ చేయడం కరెక్ట్ కాదని , సీరియల్స్ ఇంట్లో ఉండే ఫ్యామిలీస్ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాయంటూ చెప్పుకున్నాడు. ఫైనల్ గా రెండూ క్రియేటివ్ జాబ్సే అంటూ సమర్దించుకునే ప్రయత్నం చేశాడు పైడిపల్లి.
మీ అందరికీ సినిమా తీయడం ఎంత కష్టమో తెలుసా ? సినిమా కోసం అందరం ఎన్ని త్యాగాలు చేస్తామో తెలుసా ? అంటూ ఫైనల్ గా తన అక్కసును వెల్లబుచ్చాడు వంశీ. దీంతో వంశీ పడిపల్లి వీడియో కి కౌంటర్ గా మనంఎంత కష్టపడ్డామో ఆడియన్స్ కి అనవసరమని, వాళ్ళ టికెట్ కి న్యాయం జరగడం ముఖ్యమని లోకేష్ కనగరాజ్ చెప్పిన పాత వీడియో పోస్ట్ చేస్తూ పైడిపల్లి పర్ఫెక్ట్ గా ఆన్సర్ ఇస్తున్నారు తమిళ్ ఆడియన్స్.
This post was last modified on January 17, 2023 6:38 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…