ఇంకో ఎనిమిది రోజుల్లో కింగ్ ఖాన్ పఠాన్ విడుదల కాబోతోంది. బాలీవుడ్ దీని మీద గంపెడాశలు పెట్టుకుంది. రెండేళ్లకు పైగా అయిదు వందల కోట్ల వసూళ్లు తెచ్చిన స్ట్రెయిట్ మూవీ ఏదీ లేక అలో లక్ష్మణా అంటున్న నార్త్ బిజినెస్ ని కాపాడాల్సింది షారుఖ్ ఖానే.
కీలకమైన జనవరి రెండో వారాన్ని రెండు డిజాస్టర్లు తినేశాయి. ఉన్నంతలో వారసుడు, వాల్తేరు వీరయ్య హిందీ డబ్బింగ్ వెర్షన్లే అంతో ఇంతో ఫీడింగ్ కి ఉపయోగపడుతున్నాయి. అవతార్ ది వే అఫ్ వాటర్ కు లాంగ్ రన్ రాకపోయి ఉంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. అందుకే పఠాన్ అందరి కళ్ళకు ఆపద్బాంధవుడిగా కనిపించడంలో అతిశయోక్తి లేదు.
ఈ ప్యాన్ ఇండియా మూవీని అన్ని ప్రధాన భాషల్లో డబ్బింగ్ చేశారు. రెగ్యులర్ ఫార్మాట్స్ తో పాటు ఐమ్యాక్స్ లోనూ షూట్ చేశారంటే యష్ సంస్థ దీని మీద ఎంత బడ్జెట్ పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా బాగానే ఉంది కానీ పఠాన్ 25న రానుండగా ఒక రోజు అలస్యంగా రిలీజవుతున్న తెలుగు సినిమాలు పఠాన్ దెబ్బను కాచుకోవాల్సి ఉంటుంది. వాటిలో మొదటిది సుధీర్ బాబు హంట్. ఇప్పటిదాకా బజ్ అయితే లేదు. శ్రీదేవి సోడా సెంటర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఫలితాలు మార్కెట్ మీద తీవ్ర ప్రభావమే చూపించాయి. అందుకే హంట్ మీద జనాల్లో పెద్ద సౌండ్ లేదు
సితార లాంటి బ్యానర్ నుంచి వస్తున్నా బుట్టబొమ్మ సందడి సోసోగానే ఉంది. మలయాళం హిట్ కప్పేలాకు రీమేక్ గా రూపొందిన ఈ సినిమాకు ముందు అనుకున్న క్యాస్టింగ్ విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ. ఇదే కాంబో అయితే క్రేజ్ ఉండేది కానీ తర్వాత మారిపోవడంతో హైప్ కాస్తా జీరోకు చేరుకుంది.
కన్నడలో భారీ బిల్డప్ తో రూపొందిన క్రాంతిని తెలుగులోనూ తెస్తున్నారు. ఆ మధ్య వచ్చిన రాబర్ట్ హీరో దర్శన్ చిత్రం ఇది. ఇవి కాకుండా రెబెల్స్ అఫ్ తుపాకుల గూడెం కూడా వస్తోంది. ఇవన్నీ పఠాన్ దెబ్బను గట్టిగా కాచుకోవాల్సి ఉంటుంది. షారుఖ్ ఏ మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా గట్టి ఫైటే చేయాలి
This post was last modified on January 17, 2023 6:37 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…