ప్రమోషన్స్ పలు రకాలు. ఎవరు ఎలా అయినా సినిమాను ప్రమోట్ చేస్కోవచ్చు. ప్రమోషన్స్ లో ఎవరి దారి వారిది. అయితే యంగ్ హీరోలు ఈ మధ్య సినిమా ప్రమోషన్స్ లో కొత్త దారులు వెతుకుతున్నారు. జనాల్లోకి తన సినిమాను తీసుకెళ్లేందుకు కొత్త అవతారాలు ఎత్తుతున్నారు. తాజాగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సంక్రాంతికి తన సినిమాను గట్టిగా ప్రమోషన్ చేసుకునే ప్రయత్నం చేశాడు. కిరణ్ తదుపరి సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించి పల్లె టూర్లలో సంక్రాంతి ప్రమోషన్ చేసుకున్నాడు కుర్ర హీరో.
సంక్రాంతి పండుగ అంటే ఎవరికైనా గోదావరి జిల్లాలే గుర్తొస్తాయి. సంక్రాంతిను అక్కడ సెలెబ్రేట్ చేసే లెవెలే వేరు. కోడి పందేలు , గుంపులు గుంపులుగా జనాలు, జాతర్లు ఇలా చాలా సందడి ఉంటుంది. అందుకే కిరణ్ ఈస్ట్ , వెస్ట్ లో వాలిపోయాడు. కోడి పందేలు చూస్తూ జనాలతో తన సినిమా గురించి చెప్పుకున్నాడు.
పంచే కట్టుతో ఉభయ గోదావరి జిల్లాల్లో సందడి చేశాడు. వెళ్ళిన ప్రతీ గ్రామం నుండి కిరణ్ కి మంచి స్వాగతం దక్కింది. అసలే గోదావరి జిల్లాల ప్రజల మర్యాద గురించి చెప్పేదేముంది ? తమ ఊరికి వచ్చిన ఈ కుర్ర హీరో ను సొంత అల్లుడిలా చూసుకున్నారు. పనిలో పనిగా తన సినిమాను ఇంటిల్లి పాది వచ్చి చూడాలని కిరణ్ అక్కడి ప్రేక్షకులను కోరుకున్నాడు. ఎస్ ఆర్ కళ్యాణ మండపం తర్వాత కిరణ్ నుండి వచ్చిన అన్ని సినిమాలు నిరాశ పరిచాయి. ఇక తన ఆశలన్నీ ఇప్పుడు వినరో భాగ్యము మీదే పెట్టుకున్నాడు కుర్ర హీరో. మరి కిరణ్ చేసిన సంక్రాంతి ప్రమోషన్ ఈ సినిమాకి అక్కడ కలెక్షన్స్ పెంచుతుందా ? చూడాలి.
This post was last modified on January 17, 2023 6:25 pm
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…