గాడ్ ఫాదర్ ప్రమోషన్లతో మొదలుపెట్టి వాల్తేరు వీరయ్య ఇంటర్వ్యూల దాకా పలు సందర్భాల్లో డైరెక్టర్ల వర్కింగ్ స్టైల్ గురించి చిరంజీవి చేసిన పలు కామెంట్లు ఆచార్య దర్శకుడు కొరటాల శివ గురించేనన్న విశ్లేషణలు సోషల్ మీడియాలో గట్టిగానే తిరిగాయి. అది డిజాస్టర్ కావడం వల్లే మెగాస్టార్ ఉద్దేశపూర్వకంగా అన్నారని రకరకాల కోణాల్లో మీమ్స్ ట్రోల్స్ జరిగాయి. జూనియర్ ఎన్టీఆర్ తో ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీకి రెడీ అవుతున్న టైంలో ఇలాంటి ప్రచారాలు కొరటాలకు అంత మేలు చేసేవి కాదు. ఎట్టకేలకు ఈ గాసిప్స్ కి బ్రేక్ వేస్తూ చిరు దీనికి సంబంధించిన క్లారిటీ స్వయంగా ఇచ్చేశారు.
సహజంగా బాలీవుడ్ హాలీవుడ్ మేకర్స్ అనుసరించే శైలిని గురించి మాత్రమే తాను ప్రస్తావించానని అలాంటి ప్లానింగ్ మనమూ పక్కా ప్రణాళికతో చేసుకుంటే నిర్మాతకు బోలెడు డబ్బు మిగులుతుందని తన ఉద్దేశమని అంతే తప్ప కొరటాల గురించి చెప్పాలనే ఉద్దేశం ఎంత మాత్రం లేదని చెప్పారు. బాబీ ఈ విషయంలో సక్సెస్ అయ్యాడని అతన్ని మాత్రమే హైలైట్ చేశానని అన్నారు. మరి కొరటాల బడ్జెట్ దాటించలేదనే మాట చెప్పలేదు కానీ ఒకవేళ ఆచార్య బ్లాక్ బస్టర్ అయినా తాను ఇదే మాట అనేవాడినని కుండబద్దలు కొట్టారు. రాజుగారి చిన్నబ్బాయి మంచోడన్నారు కానీ పెద్దబ్బాయి గురించి చెప్పలేదు సామెతలా అయ్యింది.
కారణం ఏదైనా చిరంజీవి మొన్న సక్సెస్ మీట్ లో అన్న మాటలు వివిధ వర్గాల్లో చర్చలకు దారి తీశాయి. కొందరు దర్శకులు పది కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టించి గర్వంగా ఫీలవుతారని అలాంటి వాళ్లంతా వాల్తేరు వీరయ్యని కేస్ స్టడీగా తీసుకోవాలని చెప్పడమూ కొంత అతిశయోక్తిగా అనిపించింది. ఎందుకంటే బడ్జెట్ కంట్రోల్ విషయానికి వస్తే క్రిష్ లాంటి వాళ్ళను రాజమౌళి పొగిడిన సందర్భాలున్నాయి. గౌతమిపుత్రశాతకర్ణి టైంలో జరిగింది అందరికీ గుర్తే. ఇప్పుడు బాబీ ఒక్కడే కాదు గతంలో ఎందరో కాస్ట్ కటింగ్ విషయంలో ఋజువు చేసుకున్న వాళ్లే. ఏదైతేనేం ఫైనల్ గా కొరటాల టాపిక్ కి బ్రేక్ వేశారు.
This post was last modified on January 17, 2023 1:22 pm
ఉత్సాహం మంచిదే కానీ సమయం.. సందర్భం చూసుకోవాలి. అదేమీ లేకుండా కూటమి సర్కారుకు ఉన్న సున్నిత అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా…
టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు టార్గెట్ గా మంగళవారం తెల్లవారుజామున ఆదాయపన్ను శాఖ సోదాలు మొదలయ్యాయి. బడా నిర్మాతగానే…
అమెరికాలో అధ్యక్ష మార్పును ఆ దేశ ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ తనకు అనుకూలంగా మార్చుకునే దిశగా తెలివిగా అడుగులు…
2024 ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నాటి నుంచి ఎందుకనో గానీ… వైసీపీలో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. సరిగ్గా ఎన్నికల…
అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ జే. ట్రంప్ పదవీ ప్రమాణం చేశారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఏర్పాటు…
స్విట్జర్లాండ్లోని దావోస్లో సోమవారం నుంచి ప్రారంభమైన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకోసం వెళ్లిన.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్,…