నాలుగు వారాల ముందు మాస్ రాజా రవితేజ కెరీర్ ప్రమాదంలో ఉన్నట్లు కనిపించింది. ఆయన భవితవ్యంపై చాలామందికి సందేహాలు నెలకొన్నాయి. అందుక్కారణం గత ఏడాది ఆయన ఎదుర్కొన్న పరాభవాలే. మంచి అంచనాల మధ్య వచ్చిన ‘ఖిలాడి’ ఫ్లాప్ కాగా.. దీని తర్వాత పెద్దగా బజ్ లేకుండా రిలీజైన ‘రామారావు ఆన్ డ్యూటీ’ మాస్ రాజా కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఆ సినిమా రవితేజ మార్కెట్ మీద బాగా ప్రతికూల ప్రభావం చూపింది.
ఇక మాస్ రాజా పనైపోయిందని చాలామంది తీర్మానించేశారు కూడా. వరుస హిట్లు ఇస్తున్న త్రినాథరావు నక్కిన-ప్రసన్నకుమార్ బెజవాడల కలయికలో ‘ధమాకా’ తెరకెక్కినప్పటికీ.. దానికి రిలీజ్ ముంగిట పెద్దగా బజ్ కనిపించలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ అంతంతమాత్రంగా నడిచాయి. సినిమాకు టాక్ అటు ఇటు అయితే 2022లో మూడో డిజాస్టర్ రవితేజ ఖాతాలో చేరడం.. తర్వాతి సినిమాల పరిస్థితి దయనీయంగా మారడం ఖాయం అనుకున్నారు.
కానీ ‘ధమాకా’ అంచనాలకు తగ్గట్లే డివైడ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఆ టాక్‌కు సంబంధం లేకుండా వసూళ్ల మోత మోగించిందీ చిత్రం. క్రిస్మస్ సెలవులను పూర్తిగా ఉపయోగించుకుంటూ రవితేజ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ అయింది ‘ధమాకా’. 2, 3 వారాల్లో కూడా ఈ సినిమాకు మంచి షేర్ రావడం విశేషం.
ఈ సినిమా ఇంకా థియేటర్లలో ఉండగానే సంక్రాంతికి మాస్ రాజా స్పెషల్ రోల్ చేసిన ‘వాల్తేరు వీరయ్య’ రిలీజైంది. ఈ సినిమాకు కూడా డివైడ్ టాకే వచ్చింది. కానీ అది కూడా వసూళ్ల మోత మోగించేస్తోంది. రవితేజ ప్రత్యేక పాత్ర ఈ సినిమాకు ప్లస్ అయింది. మాస్ రాజా లక్ ఫ్యాక్టర్ కొనసాగి ఈ సినిమా కూడా ఘనవిజయం దిశగా అడుగులు వేస్తుండడంతో ఆయన అభిమానుల సంతోషం మామూలుగా లేదు. మూడు వారాల వ్యవధిలో రవితేజ జాతకం మారిపోయిందని.. ఆయన కెరీర్ మళ్లీ పీక్స్‌ను అందుకుందని.. ఇది ఎవరూ ఊహించని విషయం అని వాళ్లు మురిసిపోతున్నారు.
This post was last modified on January 17, 2023 9:08 am
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…