ప్రేమకు పెళ్లికి వయసుతో సంబంధం లేదన్న మాట వాస్తవం. ఇది చరిత్ర ఎన్నోసార్లు ఋజువు చేసింది. ఎవరి మీద ఎప్పుడు ఎవరికి మనసు మళ్లుతుందో చెప్పడం కష్టం. అందుకే తెరమీద ప్రేమకథలు అంతగొప్ప ఆదరణ పొందుతాయి. ఏఎన్ఆర్ మూగమనసులతో మొదలుపెట్టి నాగచైతన్య ఏ మాయ చేశావే దాకా ప్రతి క్లాసిక్ వెనుక ఎన్నో మధురమైన జ్ఞాపకాలుంటాయి. దానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు సైతం మినహాయింపు కాదు. యాభై పడికి దగ్గరగా ఉన్న టైంలో రెండో వివాహం చేసుకోవడం ఇండస్ట్రీలోనే కాదు సోషల్ మీడియా సగటు జనాల్లో కూడా మంచి ఆసక్తి రేపడం ఎవరూ మర్చిపోలేదు.
పెళ్లి ఫోటోలు గట్రా చూడటం తప్ప అంతకు మించి కథా కమామీషు ఏమి తెలియదు. ఫైనల్ గా దిల్ రాజు సతీమణి వైఘా రెడ్డినే క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమ ప్రేమ ఎక్కడ మొదలైందో చెప్పేశారు. ఆమె ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తున్నప్పుడు ఓసారి రాజుగారు పెన్ను కావాలని అడగటంతో పరిచయం షురూ అయ్యింది. అక్కడి నుంచి మెల్లగా మాటలు కలపడం ఫోన్ నెంబర్లు తీసుకోవడం జరిగిపోయాయి. రెండో వివాహం గురించి సీరియస్ గా ఆలోచిస్తున్న టైంలో తేజస్విని(వైఘా మొదటి పేరు) గురించి కూలంకషంగా విశ్లేషించుకున్నాకే ఓకే చెప్పారట.
మరో ట్విస్టు ఏంటంటే వైఘా రెడ్డికి వివాహానికి ముందు సినిమాల మీద పెద్దగా ఇష్టం లేదు. లవ్ మొదలయ్యాకే గూగుల్ చూసి దిల్ రాజు దర్శకుడు కాదు నిర్మాతని తెలిసిందట. ఈ తెలియనితనమే ఆమెలో దిల్ రాజుని ఆకట్టుకున్న మరో అంశం. ఎట్టకేలకు పెద్దలను ఒప్పించిన ఈ జంట నిజ జీవితంలో ఒక వారసుడుకి తల్లితండ్రులు కావడం మరో మధుర ఘట్టం. స్క్రీన్ మీద నడిచే సింపుల్ లవ్ స్టోరీకి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉన్న రాజుగారి ప్రేమకథ తెరమీదకొచ్చినా బాగుంటుంది. అప్పట్లో మా నాన్నకు పెళ్లి, స్వాతి టైపు సినిమాలు ఈ కాన్సెప్ట్ తో రూపొందినవే. హిట్టయ్యాయి కూడా
This post was last modified on January 17, 2023 9:05 am
శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్ను సాగిస్తున్న…