కొన్ని పెద్ద బ్యానర్లకు స్టార్ హీరోల కాంబోలు బాగా కలిసి వస్తాయి. మైత్రి మూవీ మేకర్స్ కి మెగా హీరోలతో కలయిక చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఈ సంస్థ మూడో సినిమా 2018 సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం. ఎంత పెద్ద బ్లాక్ బస్టరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పరీక్షల సీజన్ మార్చిలో రిలీజై అది నెలకొల్పిన రికార్డులు అన్ని ఇన్ని కావు. సాయి ధరమ్ తేజ్ వరస ఫ్లాపులో ఉన్నప్పుడు చిత్రలహరి మంచి బ్రేక్ ఇచ్చింది. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ కమర్షియల్ గానూ దాని బడ్జెట్ కు తగ్గట్టు బాగా పే చేసింది సుప్రీమ్ హీరోని తిరిగి ట్రాక్ లోకి తెచ్చింది.
వైష్ణవ్ తేజ్ ని పరిచయం చేస్తూ ఉప్పెన రేపిన సంచలనం తెలిసిందే. కరోనా టైంలో వడ్డీల భారాన్ని తట్టుకుని థియేటర్ రిలీజ్ కోసం ఎదురు చూసిన దానికి తగ్గ గొప్ప రిజల్ట్ దక్కింది. ఎలాంటి అంచనాలు లేకుండా వంద కోట్లకు పైగా లాగేసింది. ఇక పుష్ప గురించి చెప్పేదేముంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అనుకుంటారు కానీ మెగా టీమ్ నుంచి అల్లు అర్జున్ పూర్తి విడిగా చేయలేం కాబట్టి దీని బ్లాక్ బస్టర్ సక్సెస్ కూడా ఈ లిస్టులోకి వేయొచ్చు. ఇది ఎంత పెద్ద హిట్ అంటే ఐకాన్ స్టార్ కి రెండో భాగానికి ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ లో అంచనాలతో పాటు బిజినెస్ రేంజ్ ని పెంచేసింది.
ఇప్పుడు వాల్తేరు వీరయ్య వంతు వచ్చింది. మూడు రోజులకే నూటా ఎనిమిది కోట్ల గ్రాస్ తో పాటు యుఎస్ లో 1.7 మిలియన్ల వసూళ్లతో అక్కడి టాప్ 10 ఛార్ట్ లోకి దూసుకుపోయింది. ఈ మొత్తం జాబితా చూసుకుంటే మైత్రికి డబుల్ హ్యాట్రిక్ పూర్తయిపోయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ల ఉస్తాద్ భగత్ సింగ్ వంతు వచ్చింది. ఇది పైన చెప్పిన వాటి రికార్డులన్నీ బద్దలు కొట్టేస్తుందని ఇంకా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాకుండానే పవర్ స్టార్ ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టేసుకున్నారు. మొత్తానికి మైత్రికి మెగా సెంటిమెంట్ బాగానే కలిసి వస్తోంది. వీటన్నటికీ దేవిశ్రీ ప్రసాదే సంగీత దర్శకుడు కావడం క్లైమాక్స్ ట్విస్టు.
This post was last modified on January 17, 2023 9:00 am
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…