టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడైన సుకుమార్.. హీరోలు కాకుండా మిగతా ఆర్టిస్టులను ఎక్కువగా రిపీట్ చేయడానికి ఇష్టపడరు. తన ప్రతి సినిమాకూ హీరోయిన్ని మార్చేస్తుంటాడు. అలాగే క్యారెక్టర్ రోల్స్‌లోనూ ఎప్పటికప్పుడు కొత్త వాళ్లతో పని చేయడానికి ఇష్టపడుతుంటాడు. విలన్ల విషయంలోనూ ఒక దశ వరకు ఇలాగే సాగేది. కానీ ‘నాన్నకు ప్రేమతో’ దగ్గర సుకుమార్ విలన్ విషయంలో స్ట్రక్ అయిపోయాడు. ఆ చిత్రంలో జగపతిబాబును స్టైలిష్ విలన్ పాత్రలో భలేగా ప్రెజెంట్ చేసిన సుకుమార్.. దాని తర్వాత రామ్ చరణ్‌తో చేసిన ‘రంగస్థలం’లోనూ విలన్‌గా ఆయన్నే కొనసాగించాడు. ఆ చిత్రంలో కూడా జగపతికి ఒక డిఫరెంట్ రోల్ పడింది. దాన్ని ఆయన బాగానే పండించాడు.
ఐతే ‘పుష్ప’కు వచ్చేసరికి సుక్కు రూటు మార్చినట్లే కనిపించాడు. ఫస్ట్ పార్ట్‌లో సునీల్‌ను దాదాపు మెయిన్ విలన్ని చేశాడు. చివర్లో ఫాహద్ ఫాజిల్ పాత్రను ప్రవేశపెట్టి దాన్ని సెకండ్ పార్ట్‌కు మెయిన్ విలన్‌గా మార్చనున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. ఆ ప్రకారమే ఫాహద్ ‘పుష్ప: ది రూల్’లో బన్నీని ఢీకొట్టబోతున్నాడు. ఐతే ఇందులో వేరే పెద్ద విలన్ కూడా ఉన్నాడట. ఆ పాత్రకు జగపతిబాబును తీసుకున్నారని సమాచారం.
ఫాహద్‌కు అండగా నిలుస్తూ, పుష్సకు సపోర్టుగా ఉన్న రావు రమేష్‌కు ఎదురు నిలిచే రాజకీయ నాయకుడి పాత్రలో జగపతి కనిపించనున్నాడబట. సెకండ్ పార్ట్ కూడా అయితే తప్ప ‘పుష్ప’ సినిమా పూర్తయినట్లు కాదు. ఈ ప్రకారం చూస్తే వరుసగా మూడో సినిమాలోనూ జగపతినే సుక్కు విలన్‌గా కొనసాగిస్తున్నాడన్నమాట. సుకుమార్ లాంటి మేటి దర్శకుడిని ఇంతగా మెప్పించాడంటే జగపతికి ఇదొక అచీవ్మెంట్ అనే చెప్పాలి. జగపతి లుక్, మేనరిజమ్స్ చాలా డిఫరెంటుగా ఉంటాయట ఈ చిత్రంలో. ఆ పాత్రను చూసి జనాలు షాకవుతారని సమాచారం.
This post was last modified on January 17, 2023 8:47 am
నాగచైతన్య కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న తండేల్ నుంచి నిన్న మొదటి ఆడియో సింగల్ రిలీజయ్యింది. అక్కినేని…
క్రికెట్ చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్ ను అంత ఈజీగా ఎవరు మర్చిపోలేరు. ప్రత్యర్థి బౌలర్లకు నిద్రలేకుండా చేసిన ఈ అగ్రశ్రేణి…
టాలీవుడ్ ప్రేమికుల కోసం కొత్త శుక్రవారం సిద్ధమయ్యింది. ఈ రోజు రిలీజవుతున్న వాటిలో ప్రధానంగా మూడు సినిమాలు ఆడియన్స్ దృష్టిలో…
గత కొన్ని నెలలుగా ఆన్ లైన్ వేదికగా మెగాభిమానులు వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న రగడ చూస్తూనే ఉన్నాం.…
సంక్రాంతి పండక్కి ప్రతిసారీ సినిమాను పోటీలో నిలిపే ప్రయత్నం చేస్తుంటారు దిల్ రాజు. ఒకవేళ తన ప్రొడక్షన్లో సినిమా లేకపోయినా..…