బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన రెండు చిత్రాలు తీవ్రంగా నిరాశ పరిచినా.. వాటి అనంతరం రానున్న ‘ఆదిపురుష్’ నెగెటివిటీ బారిన పడ్డా.. ప్రభాస్ మీద అభిమానుల్లో నమ్మకం ఏమీ సడలిపోలేదు. సరైన సినిమా పడితే ప్రభాస్ స్టామినా ఏంటో బాక్సాఫీస్ చూస్తుందనే ధీమాతోనే ఉన్నారు. ప్రభాస్ లైనప్ వారి ఆశలను నిలిపి ఉంచుతోంది. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో చేస్తున్న ‘సలార్’.. ‘మహానటి’ డైరెక్టర్ తీస్తున్న ‘ప్రాజెక్ట్-కే’ చిత్రాలతో ప్రభాస్ బలంగా బౌన్స్ బ్యాక్ అవుతాడనే నమ్మకం అభిమానుల్లో ఉంది.
వీటితో పాటు ప్రభాస్ కమిట్మెంట్లలో అత్యంత ఎగ్జైట్ చేస్తున్న సినిమాల్లో ‘స్పిరిట్’ కూడా ఒకటి. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా అంటేనే ఎగ్జైట్మెంట్ మరో స్థాయికి చేరుకుంది. కాంబినేషన్ క్రేజ్‌తోనే ఈ సినిమా హైప్ ఎక్కడికో వెళ్లిపోయింది. తాజాగా ఈ చిత్ర నిర్మాత భూషణ్ కుమార్.. ప్రభాస్ అభిమానులకు ఉత్సాహాన్నిచ్చే అప్‌డేట్స్ ఇచ్చాడు.
‘స్పిరిట్’ సినిమా ఈ ఏడాది చివర్లోనే సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలున్నట్లు భూషణ్ కుమార్ చెప్పడం విశేషం. ప్రస్తుతం సందీప్ ‘యానిమల్’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సందీప్.. ఆ సినిమా షూట్ పూర్తి కాగానే ‘స్పిరిట్’ పని మొదలుపెడతాడని.. ఏడాది చివర్లో సినిమాను మొదలుపెట్టాలని అనుకుంటున్నామని భూషణ్ తెలిపాడు.
ఇక ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ క్యారెక్టర్ చేస్తాడనే ప్రచారం నిజమే అని భూషణ్ చెప్పడం విశేషం. ప్రభాస్ ఒక డిఫరెంట్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తాడని తెలిపాడు. మాస్ హీరోల ఇమేజ్‌ను పెంచే పాత్ర అంటే పోలీస్‌దే. ప్రతి స్టార్ హీరో కూడా కెరీర్లో ఏదో ఒక దశలో ఖాకీ ధరిస్తుంటాడు. టాలీవుడ్ టాప్ స్టార్లందరూ ఆ ముచ్చట తీర్చుకున్నవాళ్లే. ఖాకీ క్యారెక్టర్లలో ఘనవిజయాలు అందుకున్న వాళ్లే. కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటిదాకా ఖాకీ వేయలేదు. అతడి కటౌట్‌కు సరైన పోలీస్ క్యారెక్టర్ పడితే సినిమా వేరే లెవెల్‌కు వెళ్లిపోతుందనడంలో సందేహం లేదు.
This post was last modified on January 17, 2023 8:30 am
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…