Movie News

చిన్న సినిమా ఏం సాధించినట్టు

ఇండస్ట్రీ పెద్దలు, ప్రొడ్యూసర్లు, వివిధ వర్గాల ప్రతినిధులు తరచు చెప్పే మాట చిన్న సినిమాలు బ్రతకాలి. కేవలం భారీ చిత్రాలతో యాభై నాలుగు శుక్రవారాలను మేనేజ్ చేయడం అసాధ్యం. అందుకే బ్యాలన్స్ చేయడం చాలా కీలకం.

అలా అని రిస్కులను పరిగణనలోకి తీసుకోకుండా వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకోకుండా బరిలో దిగితే నష్టం ఒకరికే కాదు పలు కోణాల్లో అందరికీ ఉంటుంది. దానికి ఉదాహరణే కళ్యాణం కమనీయం. యువి సంస్థ ఉత్పత్తి కావడంతో జనవరి 14న దీనికి చెప్పుకోదగ్గ రిలీజ్ దక్కింది. ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు సహకరించారు. క్వాలిటీ స్క్రీన్లు వచ్చేలా చేశారు.

తీరా జరిగింది ఏమిటి. గంటన్నర నిడివితో షార్ట్ ఫిలింకి ఎక్కువ సినిమాకు తక్కువ ఫీడ్ బ్యాక్ తో ఈ మూవీ పెద్దగా మెప్పించలేక నీరసపడిపోయింది. పండగ టైంలో మాస్ మసాలాలకే అగ్ర తాంబూలం దక్కుతుందని తెలిసినా కూడా ఇంత సాహసానికి తెగబడటం వల్ల నష్టం ఎవరికి.

మంచి థియేటర్లు ఇవ్వడం వల్ల వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు అదనంగా రావాల్సిన రెవిన్యూ ఆడియన్స్ తిరిగి ఇంటికి వెళ్లిపోవడం వల్ల నష్టపోయినట్టు అయ్యింది. ఉదాహరణకు క్రాస్ రోడ్స్ లో దేవి 70 ఎంఎం లాంటి పెద్ద థియేటర్ కళ్యాణం కమనీయంకు ఇచ్చారు. కట్ చేస్తే ఏ షోకి పది వేల గ్రాస్ రాలేదు. అంటే అద్దెకే ఎదురు కట్టాల్సిన పరిస్థితి

తర్వాత ఆదివారం సెకండ్ షో సమయానికి వాల్తేరు వీరయ్యకి ఇచ్చారు కానీ అప్పటికే లేట్ అయిపోయింది. దాదాపు అన్ని సెంటర్లలోనూ ఇదే సీన్ కనిపించింది. పైగా దిల్ రాజు వారసుడు ఉందని తెలిసి కూడా కళ్యాణం కమనీయంని దింపడం వల్ల అప్ కమింగ్ హీరో సంతోష్ శోభన్ ఖాతాలో మరో ఫ్లాప్ దక్కడం తప్ప ఇంకేం రాలేదు.

యువికి పోయేదేమీ లేదు. లాభమో నష్టమో ఈజీగా బయట పడుతుంది. కానీ దానికి పనిచేసివారెవరికి సక్సెస్ ఫుల్ మూవీలో భాగమయ్యామన్న ఆనందం లేకుండా పోయింది. ఆ మధ్య దసరా టైంలో స్వాతిముత్యం సైతం ఇదే అనుభవానికి లోనవ్వడం మర్చిపోగలమా 

This post was last modified on January 16, 2023 6:02 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

1 hour ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

2 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

2 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

3 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

3 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

3 hours ago