మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి విజేత అనడంలో మరో మాట లేదు. నందమూరి బాలకృష్ణ సినిమా ‘వీరసింహారెడ్డి’ లాగే దీనికి కూడా యావరేజ్ టాకే వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర దాని ఊపు మాత్రం మామూలుగా లేదు. నిజానికి ప్రి రిలీజ్ బజ్ విషయంలో ‘వీరసింహారెడ్డి’దే పైచేయిగా కనిపించింది.
ఇటు తెలుగు రాష్ట్రాల్లో, అటు యుఎస్‌లో బాలయ్య సినిమాకే ఎక్కువ హైప్ ఉందనుకున్నారంతా. యుఎస్‌లో బాలయ్య మార్కెట్ బేసిగ్గా వీకే అయినప్పటికీ.. ప్రి సేల్స్‌లో చిరు చిత్రం మీద ‘వీరసింహారెడ్డి’దే పైచేయి అయింది.
కానీ ప్రిమియర్స్ తర్వాత కథ మారిపోయింది. ప్రిమియర్స్ వరకు స్వల్పంగా ఆధిక్యం సాధించిన బాలయ్య చిత్రం.. ఆ తర్వాత పడుకుండిపోయింది. 7 లక్షల డాలర్లకు పైగా ప్రిమియర్స్ ద్వారానే రాబట్టిన ‘వీరసింహారెడ్డి’.. తొలి రోజు 40 వేల డాలర్ల లోపే కలెక్ట్ చేయడం పెద్ద షాక్.
కానీ చిరంజీవి సినిమా అలా కాదు. ప్రిమియర్స్‌తో 6.8 లక్షల డాలర్ల దాకా కలెక్ట్ చేసిన ‘వాల్తేరు వీరయ్య’ తొలి రోజు కూడా బలంగా నిలబడింది. 3 లక్షల డాలర్లు వసూలు చేసి ఔరా అనిపించింది. ఆ తర్వాత కూడా సినిమా జోరు తగ్గలేదు. శని, ఆదివారాల్లో కూడా ఈ చిత్రం 3 లక్షల డాలర్ల చొప్పున కలెక్ట్ చేసింది.
మామూలుగా ప్రిమియర్స్ తర్వాత వీకెండ్లో ఎక్కువ వసూళ్లు వచ్చేది శనివారమే. ఆదివారం డ్రాప్ ఉంటుంది. కానీ ‘వాల్తేరు వీరయ్య’ మాత్రం ఆదివారం కూడా 3 లక్షల డాలర్లు కొల్లగొట్టి ఆశ్చర్యపరిచింది. దీన్ని బట్టి సినిమా యుఎస్ జనాలకు బాగా ఎక్కేసిందన్నది స్పష్టం. సోమవారానికి ప్రి సేల్స్ ఆశాజనకంగా ఉన్నాయి.
కాబట్టి ‘వాల్తేరు వీరయ్య’ 2 మిలియన్ క్లబ్బులోకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో సైతం చిరు సినిమా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. చిరు కెరీర్లోనే అతి పెద్ద హిట్లలో ఒకటిగా ఇది నిలిచే అవకాశం కనిపిస్తోంది.
This post was last modified on January 16, 2023 12:49 pm
రానాను చిరంజీవి కొట్టడం ఏంటి.. అంత తప్పు ఏం చేశాడు.. రానాను కొట్టేంత చనువు చిరుకు ఉందా అని ఆశ్చర్యపోతున్నారా?…
‘పుష్ప: ది రైజ్’ సినిమాలో మిగతా హైలైట్లన్నీ ఒకెత్తయితే.. సమంత చేసిన ఐటెం సాంగ్ మరో ఎత్తు. అప్పటిదాకా సమంతను…
కోలీవుడ్‌లో పిన్న వయసులోనే మంచి పేరు సంపాయించుకున్నయువ హీరో దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్‌కు సంబంధం లేకుండా..…
జైలర్ లో చేసింది క్యామియో అయినా తెలుగు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్…
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే.…
గత వారం కంగువ, మట్కాలు తీవ్రంగా నిరాశపరచడంతో థియేటర్లు నవంబర్ 22 కొత్త రిలీజుల కోసం ఎదురు చూస్తున్నాయి. డిసెంబర్…