Movie News

మహేష్‌తో శ్రీలీల.. ఇదిగో క్లారిటీ

ఏడాదిన్నర కిందట ‘పెళ్ళిసంద-డి’ చిత్రాన్ని చూసిన వాళ్లంతా తలలు పట్టుకున్నారు.. ఇదేం సినిమారా బాబూ అని. 20 ఏళ్ల ముందు వచ్చినా ఔట్ డేటెడ్ అనిపించే సినిమా అది. అయినా సరే.. అది బాగానే ఆడిందంటే అందుక్కారణం హీరో హీరోయిన్లే. ముఖ్యంగా కన్నడ అమ్మాయి అయిన శ్రీలీల.. తన అందం, అభినయంతో కట్టిపడేసింది.

ఆ సినిమాతో వచ్చిన పేరుతోనే తెలుగులో వరుసగా అవకాశాలు అందుకుంది. అందులో ఒకటి.. రవితేజ సరసన చేసిన ధమాకా. ఈ సినిమా గత ఏడాది చివర్లో క్రిస్మస్ కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ అయింది. వరుసగా రెండు సక్సెస్‌లు వస్తే ఇక ఏ హీరోయిన్ అయినా ఆగుతుందా? ఈ ఊపులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఛాన్స్ కొట్టేసింది. హారిక హాసిని క్రియేషన్స్ బేనర్లో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న సినిమాలో శ్రీ లీల ఓ కథానాయికగా ఎంపికైంది.

ఈ సినిమాలో శ్రీలీల ఉందా లేదా అనే విషయంలో ఇటీవల సందిగ్ధత నెలకొంది. ఐతే ఇప్పుడు స్వయంగా నిర్మాత నాగవంశీనే క్లారిటీ ఇచ్చేశాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే ఓ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మీడియాలో అందరూ శ్రీలీలను సెకండ్ హీరోయిన్ అని పేర్కొంటుండడం నాగవంశీకి నచ్చలేదు.

తాము హీరోయిన్లకు నంబరింగ్ అంటూ ఏమీ ఇవ్వలేదని.. శ్రీలీలను సెకండ్ హీరోయిన్ అనడం కరెక్ట్ కాదని.. ఆమె కూడా ఇందులో ఓ హీరోయిన్ మాత్రమే అని నాగవంశీ మీడియాకు క్లారిటీ ఇచ్చాడు. ఎలాగైతేనేం.. ఈ సినిమాలో శ్రీలీల కూడా భాగమే అని అయితే స్పష్టం అయిపోయింది.

మూడో సినిమాకే మహేష్‌తో, అది కూడా ఇంత క్రేజీ ప్రాజెక్టులో నటించడం అంటే మాటలు కాదు. పైగా నాగవంశీ మాటల్ని బట్టి చూస్తే ఆమెకు కూడా ముఖ్యమైన పాత్రే ఇచ్చినట్లున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమా క్లిక్ అయితే శ్రీలీల రేంజ్ ఇంకా పెరగిపోవడం ఖాయం.

This post was last modified on January 16, 2023 8:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అర్థం కాలేదంటూనే థియేటర్లకు వెళ్తున్నారు

నిన్న విడుదలైన ఉపేంద్ర యుఐకి విచిత్రమైన టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఇంటెలిజెంట్ మేకింగ్, అర్థం చేసుకున్నోళ్లకు అర్థం చేసుకున్నంత…

1 hour ago

బాబు ఐడియా: డ్వాక్రా పురుష గ్రూపులు!

రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అన‌గానే మ‌హిళ‌లే గుర్తుకు వ‌స్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వ‌యం స‌హాయ‌క మ‌హిళా సంఘాలు!…

6 hours ago

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

13 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

14 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

14 hours ago