Movie News

దిల్ రాజుకు ఇది గట్టి దెబ్బే

అగ్ర నిర్మాత దిల్ రాజు పేరు ఈ మధ్య కాలంలో ఎంతగా వార్తల్లో నిలిచిందో తెలిసిందే. అనువాద చిత్రమైన ‘వారసుడు’కు థియేటర్ల కేటాయింపు విషయంలో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ విషయంలో బాగా నెగెటివిటీ పెరిగిపోవడంతో ఇలా అయితే కష్టమని.. తన సినిమాను మూడు రోజులు వాయిదా వేసుకుని ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలకు రిలీఫ్ ఇచ్చాడు.

ఒక దశలో మొండిగా తన సినిమా ప్రయోజనమే ముఖ్యమన్నట్లు వ్యవహరించిన రాజు.. చివరికి వెనక్కి తగ్గక తప్పలేదు. కొందరు దీన్ని త్యాగంలా చూసినా.. తప్పకే రాజు తగ్గాడన్న చర్చ నడిచింది. ఈ త్యాగం వల్ల ‘వారసుడు’ ఓపెనింగ్స్ మీద గట్టి ప్రభావమే పడింది. ‘వారిసు’కు తమిళంలో డివైడ్ టాక్ రావడం, అక్కడ ఓపెనింగ్స్ అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో తెలుగు వెర్షన్ మీద కూడా ఆ ఎఫెక్ట్ పడింది.

లేటుగా వచ్చినప్పటికీ రాజు ‘వారసుడు’కు చెప్పుకోదగ్గ సంఖ్యలో, మంచి మంచి స్క్రీన్లు తీసుకుని సినిమాను రిలీజ్ చేశాడు కానీ.. అది ఓపెనింగ్స్‌కు పెద్దగా కలిసి రాలేదు. సినిమాకు ఇక్కడ మరింత డివైడ్ టాక్ వచ్చింది. ఇలాంటి సినిమాలు తెలుగోళ్లు బోలెడు చూసేశారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి ఉండగా.. ఇక విజయ్ సినిమాను మనోళ్లు ఏం పట్టించుకుంటారు? అందులోనూ టాక్ సరిగా లేని సినిమాను సంక్రాంతి టైంలో ఏం చూస్తారు? మొత్తంగా ‘వారసుడు’ పెద్దగా ప్రభావం చూపట్లేదు తెలుగులో.

పోనీ తమిళంలో అయినా విజయ్‌కి పెద్ద హిట్టిచ్చారా అంటే అదీ లేదు. విజయ్ గత సినిమాలతో పోలిస్తే దీనికి వసూళ్లు తక్కువగా ఉన్నాయి. పూర్తి నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ‘బీస్ట్’కే దీని కంటే ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. అజిత్ సినిమా ‘తునివు’ దీని మీద పూర్తి ఆధిపత్యం చూపిస్తోంది. అటు తమిళంలో విజయ్‌కు ఆశించిన హిట్ ఇవ్వక.. తెలుగులో మార్కెట్ పెంచక రాజుకు చేదు అనుభవం తప్పట్లేదు.

This post was last modified on January 16, 2023 8:58 am

Share

Recent Posts

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

21 minutes ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

2 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

5 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

7 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

12 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

13 hours ago