ప్రస్తుతం ఇండియాలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగల సత్తా ఉన్న అతి కొద్దిమంది కథానాయికల్లో కీర్తి సురేష్ ఒకరు. ‘మహానటి’ సినిమాతో ఆమె ఇమేజే మారిపోయింది. ఆమె ప్రధాన పాత్రలో అరడజను దాకా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వరుస కట్టాయి.
కాకపోతే ‘మహానటి’ తర్వాత ఆమె నుంచి వచ్చిన సినిమాలు ఆ చిత్రానికి దరిదాపుల్లో కూడా నిలవలేకపోయాయి. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి.. ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లయ్యాయి.
వాటితో పోలిస్తే ‘సాని కాయిదం’ (తెలుగులో చిన్ని) కాస్త పర్వాలేదనిపించినా.. అది కూడా కీర్తి ఆశించిన ఫలితాన్నయితే ఇవ్వలేదు. కానీ కీర్తి దగ్గరికి లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్టులు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది మలయాళంలో ‘వాసి’ అనే సినిమా చేసిన ఆమె.. తాజాగా ‘రివాల్వర్ రీటా’ పేరుతో కొత్త సినిమా కబురుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సంక్రాంతి సందర్భంగా ‘రివాల్వర్ రీటా’ సినిమాను అనౌన్స్ చేశారు. చేతిలో రెండు గన్నులు పట్టుకున్న కీర్తి యానిమేటెడ్ లుక్‌తో పోస్టర్ వదిలారు. తమిళ దర్శకుడు కె.చంద్రు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. సుధాన్ సుందరం, జగదీష్ పలణిస్వామి నిర్మాతలు.
సమంత చేతుల మీదుగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కావడం విశేషం. పోస్టర్ మీద ముందే ‘నెట్ ఫ్లిక్స్’ అని వేసేయడం చూస్తే.. ఇది ఆ ఓటీటీ కోసం చేస్తున్న సినిమాలా కనిపిస్తోంది. దీనికి థియేట్రికల్ రిలీజ్ లేకపోవచ్చు.
ఇంతకుముందు కీర్తి సినిమా ‘మిస్ ఇండియా’తో నెట్ ఫ్లిక్స్ వాళ్లు చేతులు కాల్చుకున్నారు. మళ్లీ ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాను అదే సంస్థ ముందే కొనేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఫస్ట్ లుక్ చూస్తే ఇది ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీలా కనిపిస్తోంది. మరి ఈ జానర్ అయినా కీర్తికి మంచి విజయాన్నందిస్తుందేమో చూడాలి.
This post was last modified on January 15, 2023 6:42 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…