శ్రుతి హాసన్.. ఈ సంక్రాంతికి అరుదైన రికార్డును సొంతం చేసుకున్న కథానాయిక. ఈ పండక్కి తెలుగులో రిలీజైన రెండు భారీ చిత్రాల్లోనూ ఆమే కథానాయిక కావడం విశేషం. ఐతే ఆ రెండింట్లో ఒక సినిమా అయిన ‘వీరసింహారెడ్డి’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన శ్రుతి.. ఆ తర్వాత ‘వాల్తేరు వీరయ్య’ వేడుకలో పాల్గొనకపోవడం చర్చనీయాంశం అయింది. శ్రుతికి జ్వరం వచ్చిందని చెబుతూ.. ఆమె ఏం తిందో, తనను ఎవరైనా బెదిరించారేమో తెలియదు అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యల మీదా చిన్న స్థాయి దుమారం రేగింది. ఈ కౌంటర్ బాలయ్యను ఉద్దేశించే చిరు వేశాడన్న చర్చ జరిగింది.
ఆ సంగతి అలా ఉంచితే.. శ్రుతి మెంటల్ హెల్త్ సరిగా లేదని, అందుకే ఆమె ‘వాల్తేరు వీరయ్య’ వేడుకకు దూరంగా ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ రూమర్లపై శ్రుతి తాజాగా స్పందించింది. తాను వైరల్ ఫీవర్ వల్ల కొంత ఇబ్బంది పడ్డానని, అంతకుమించి ఏమీ లేదంటూ తన గురించి ఊహాగానాలు ప్రచారం చేస్తున్న వారికి కౌంటర్ వేసింది శ్రుతి.
“నేను కేవలం వైరల్ ఫీవర్ వల్ల ఇబ్బంది పడుతున్నానంతే. నన్ను కావాలనే కొంతమంది ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు. నేను ఎప్పుడూ మానసికంగా బలంగా ఉంటాను. అన్ని విధాలుగా నన్ను నేను కాపాడుకుంటాను. నన్ను కావాలనే ఇబ్బంది పెట్టాలని కొంతమంది ప్రయత్నించారు. వాళ్లు మానసిక సమస్యలతో బాధ పడుతుంటే.. వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. ఇలా కొంతమందిని టార్గెట్ చేస్తూ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం, వ్యవహారాన్ని డ్రమటిగ్గా మార్చడం వల్లే చాలామంది మెంటల్ హెల్త్ సమస్యను బయటపెట్టడానికి భయపడుతుంటారు” అని శ్రుతి పేర్కొంది.
మొత్తానికి తన గురించి సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం విషయంలో శ్రుతి బాగానే హర్టయినట్లు కనిపిస్తోంది. శ్రుతి నటించిన ‘వీరసింహారెడ్డి’; ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలు రెంటికీ డివైడ్ టాక్ ఉన్నప్పటికీ.. అవి రెండూ మంచి ఓపెనింగ్స్‌తో దూసుకెళ్తున్నాయి.
This post was last modified on January 14, 2023 8:05 am
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…