రాజకీయాల నుంచి నిష్క్రమించాక చిరు చూపిస్తున్న అతి మంచితనం ఈ మధ్య బాగా చర్చనీయాంశం అవుతోంది. అందరితో మంచిగా ఉండాలని.. మంచి అనిపించుకోవాలని.. ఎవరినీ నొప్పించకూడదని భావిస్తూ చిరు చూపించే అతి మంచితనం ఆయన అభిమానులకే నచ్చట్లేదు. ఓవైపు పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రత్యర్థులతో బలంగా తలపడుతుంటే.. ఆయన్ని వాళ్లు దారుణంగా టార్గెట్ చేస్తుంటే.. చిరు మాత్రం ఆ ప్రత్యర్థులతో సన్నిహితంగా మెలగడం.. వారిని గౌరవించడం పట్ల మెగా అభిమానుల నుంచే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చిరు సాన్నిహిత్యం అభిమానులకు నచ్చట్లేదు. తన తమ్ముణ్ని తిట్టిన వాళ్లు మళ్లీ తనను పెళ్లిళ్లు పేరంటాలకు పిలిస్తే బాధేస్తుందనడం.. ఇటీవల తనను విమర్శించిన రోజాను ఉద్దేశించి మాట్లాడుతూ ఆమె విచక్షణకే వదిలేస్తా అనడం చూసి చిరు మరీ ఇంత మర్యాదరామన్నలా వ్యవహరించాలా అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి.
ఐతే విమర్శలు, వ్యాఖ్యల సంగతి పక్కన పెడితే.. తాజాగా 2024 ఎన్నికలకు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు చిరు ఇచ్చిన జవాబు మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ ఎన్నికల్లో మీ మద్దతు ఎవరికి? మిమ్మల్ని ఇంటికి పిలిచి గౌరవించిన జగన్‌కా.. మీ తోడబుట్టిన తమ్ముడు పవన్‌కా అంటూ ఇంటర్వ్యూయర్ అడిగితే.. దానికి సూటిగా సమాధానం చెప్పలేకపోయాడు చిరు. గతంలో తన మద్దతు తమ్ముడికే.. మెగా అభిమానులందరూ కూడా జనసేన వైపే ఉంటారన్నట్లు మాట్లాడిన చిరు.. ఇదే విషయాన్ని ఈ ఇంటర్వ్యూలో చెప్పలేకపోయారు.
జగన్ పేరెత్తేసరికి.. పవన్‌కే తన మద్దతు అంటే ఏపీ సీఎంకు శత్రువును అయిపోతానని అనుకున్నారో ఏమో.. తటస్థంగా ఉండబోతున్నట్లు మాట్లాడారు. తనది ఆంధ్రప్రదేశ్ కాదని, తెలంగాణలో ఉంటున్నానని.. ఏపీ రాజకీయాలను కూడా తాను పెద్దగా ఫాలో కావట్లేదని చిరు వ్యాఖ్యానించడం విడ్డూరం.
కనీసం తమ్ముడికి బహిరంగంగా మద్దతు ప్రకటించడానికి కూడా చిరుకు ఏం అడ్డొచ్చిందని.. మరీ ఇంత డిప్లమాటిగ్గా మాట్లాడాల్సిన అవసరం ఏముందని మెగా అభిమానులే ప్రశ్నలు సంధిస్తున్నారు. రాజకీయ నాయకుడిగా చిరు వైఫల్యానికి తోడు.. తన రాజకీయ ప్రత్యర్థులతో ఆయన సాన్నిహిత్యం పవన్‌కు ఇప్పటికే ప్రతిబంధకాలుగా మారగా.. ఇప్పుడు కనీసం మెగా అభిమానులంతా పవన్ వైపే ఉండాలని బహిరంగంగా ప్రకటన కూడా చేయకపోవడం మరింత పెద్ద మైనస్ అనడంలో సందేహం లేదు.
This post was last modified on January 13, 2023 7:19 pm
దేశంలో వందల సంఖ్యలో పార్టీలు ఉన్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నాయి. కానీ, ఏ పార్టీ చేయని పని..…
అతడులో తనికెళ్ళ భరణి చెప్పే ఫేమస్ డైలాగు ఒకటుంది. బ్రహ్మాజీతో మాట్లాడుతూ ఇన్ని బళ్ళు ఎందుకురా బుజ్జి అంటాడు. బాలీవుడ్…
ఇప్పటి మన జీవిత విధానం చాలా వేగంగా మారిపోయింది. ఏదైనా తినాలనిపిస్తే కేవలం ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే సరిపోతుంది. కొన్ని…
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…