నందమూరి బాలకృష్ణ సినిమా ‘వీరసింహారెడ్డి’ రిలీజ్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానుల హంగామా మామూలుగా లేదు. సంక్రాంతి అంటే బాలయ్యకు మామూలుగానే స్పెషల్. దీనికి తోడు ‘అఖండ’ లాంటి భారీ విజయం తర్వాత బాలయ్య నటించిన చిత్రమిది.
అందులోనూ ‘అన్ స్టాపబుల్’ తాలూకు క్రేజ్.. ఇటీవలి తెలుగుదేశం శ్రేణుల ఊపు ఈ సినిమాకు ప్లస్ అయి మంచి బజ్ మధ్య సినిమా రిలీజైంది. దీంతో అభిమానుల సంబరాలు మిన్నంటుతున్నాయి.
యుఎస్‌లో ఉత్సాహం మరీ ఎక్కువై థియేటర్లో బాలయ్య ఫ్యాన్స్ చేసిన రచ్చకు.. షో ఆపించి మరీ బయటికి పంపించేయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇక్కడ హైదరాబాద్‌లో ఒక బాలయ్య అభిమాని తాలూకు వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తోంది.
హైదరాబాద్‌లోని ఒక థియేటర్లో తీసిందిగా భావిస్తున్న ఈ వీడియోలో ఇంటర్వెల్ అనంతరం ఒక ఫ్యాన్ మీడియాకు టాక్ చెబుతున్నాడు. అతను ‘వీరసింహారెడ్డి’ బ్లాక్ బస్టర్ అని తెగ ఆవేశపడిపోతూ చెబుతుండగా.. మరో వ్యక్తి మధ్యలో వచ్చాడు.
ఫస్టాఫ్ చెత్త.. ఏమీ బాగా లేదు అని అతడి మాటల్ని ఖండిస్తూ కవ్వించి వెళ్లాడు. ఈ క్రమంలో ఒక బూతు మాట కూడా అన్నాడు. దీంతో సదరు అభిమానికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అతణ్ని ఖండించిన వ్యక్తి థియేటర్ లోనికి వెళ్లిపోగా.. ఈ అభిమాని ఒక్క నిమిషం అంటూ మీడియా వాళ్లను ఆపి.. చేతికి రుమాలు లాంటిది చుట్టుకుని.. పక్కనే ఉన్న కూల్ డ్రింక్ బాటిల్ తీసుకుని థియేటర్ లోనికి వెళ్లాడు.
దీంతో ఆ బాటిల్‌తో తనను ఖండించిన వ్యక్తి తల పగలగొడతాడేమో అని అందరిలో టెన్షన్ నెలకొంది. కొన్ని నిమిషాల తర్వాత ఆ ఫ్యాన్ లోపల వాగ్వాదానికి దిగి వెనక్కి వచ్చినట్లు కనిపించాడు. అతడి చేతిలో బాటిల్ అలాగే ఉంది. దీంతో లోపలేమీ జరగలేదని మీడియా వాళ్లతో సహా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ అభిమాని ఆవేశం చూస్తే మాత్రం ఏమవుతుందో ఏమో అని ముందు అందరూ టెన్షన్ పడ్డ మాట వాస్తవం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
This post was last modified on January 12, 2023 10:19 pm
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…