Movie News

జగన్‌పై బాలయ్య పంచులే పంచులు

‘Veera Simha Reddy’ ట్రైలర్లో.. ‘‘నువ్వు సంతకం పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేదు’’ అనే డైలాగ్ వినగానే అందరికీ బాలయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశాడని స్పష్టంగా అర్థమైపోయింది.

సినిమాలో ఇలాంటి పంచులు మరిన్ని ఉంటాయనే సంకేతాలు కనిపించాయి. ఆ అంచనాలకు తగ్గట్లే బాలయ్య ‘వీరసింహారెడ్డి’లో జగన్ సర్కారు గట్టిగా టార్గెట్ చేశాడు. ఎక్కడా పేర్లు ప్రస్తావించకపోయినా.. జగన్ అండ్ కోకు తగిలే డైలాగులు సినిమాలో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నాయి. 

ఒక సీన్లో హోం మినిస్టర్.. మేం చేస్తున్న అభివృద్ధి కనిపించలేదా అంటాడు. దానికి బదులుగా బాలయ్య గట్టిగా నవ్వి.. ‘‘ఏది అభివృద్ధి? ప్రజలకు మంచి చేస్తే అభివృద్ధి వాళ్లను వేధించడం ఏం అభివృద్ధి? కొత్త పరిశ్రమలు స్థాపించడం అభివృద్ధి.. మూసేయడం అభివృద్ధా? కొత్త భవనాలు నిర్మించడం అభివృద్ధి.. కూల్చడం అభివృద్ధా? జీతాలు టైంకి ఇవ్వడం అభివృద్ధి.. బిక్షం వేసినట్లు వేయడం అభివృద్ధా..’’ అంటూ జగన్ సర్కారుకు సూటిగా తాకేలా పంచులు పేల్చాడు బాలయ్య. 

ఈ సీన్ రావడానికి ముందే మంత్రిని కలవడానికి బాాలయ్య బయల్దేరుతుంటే ఆ వెధవను నువ్వు కలిసేదేంటి అని పక్కనున్న పాత్ర బాలయ్యతో అంటే.. ప్రజలు అధికారంలో కూర్చోబెట్టిన వెధవలు వాళ్లు, కాబట్టి ప్రజానిర్ణయాన్ని గౌరవించాల్సిందే అంటూ ఇంకో ఇన్ డైరెక్ట్ పంచ్ వేశాడు బాలయ్య. ఇంకా.. ‘‘నీకు పవర్‌ను బట్టి పొగరుంటుంది. కానీ నా డీఎన్ఏలోనే పొగరుంది’’.. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో జగన్ సర్కారును కౌంటర్ చేసే పంచ్‌లు చాలానే ఉన్నాయి. మరి ఈ డైలాగులపై వైసీపీ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

19 minutes ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

3 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

4 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

5 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

5 hours ago

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

6 hours ago