వెండితెర మీద మెరిసిపోయే బ్యూటీలు తమ ప్రేమ విషయాల్ని పబ్లిక్ గా చెప్పుకోవటానికి ఇష్టపడరు. నలుగురు నోళ్లలో నానిన తర్వాత చివర్లో ఎప్పుడో చెప్పేస్తుంటారు. అప్పటివరకు తమ లవ్ రిలేషన్ ను గుట్టుగా ఉంచేస్తారు. మరికొందరు బ్యూటీలు తాము ప్రేమ.. పెళ్లి విషయం గురించి ఆలోచించటం లేదంటూనే.. మరొకరితో ప్రేమాయణాన్ని నడిపిస్తుంటారు. అలాంటి ఉదంతాలెన్నో. తాజాగా మలయాళ కుట్టి.. వరుస సినిమాలతో అందరి మనసుల్ని తన అందంతో దోచేసే ఐశ్వర్య లక్ష్మీ లవ్ మ్యాటర్ తో వార్తల్లోకి వచ్చారు.
తాజాగా ఆమె తన సోషల్ ఖాతాలో తన ప్రియుడ్ని పరిచయం చేస్తూ పోస్టు పెట్టారు. అమ్ము.. పొన్నియన్ సెల్వన్ తదితర సినిమాలతో ఫేమ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ నెల క్రితం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను పెళ్లి గురించి ఆలోచించటం లేదని.. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదని పేర్కొన్నారు. అలాంటి ఆమె తాజాగా నటుడు అర్జున్ దాస్ తో తానుకలిసి ఉన్న ఫోటోను పోస్టు చేసి.. కింద లవ్ సింబల్ పెట్టటంతో ఆమె తన లవ్ మ్యాటర్ ను రివీల్ చేసినట్లుగా చెబుతున్నారు.
దీంతో.. ఆమె అభిమానులు పలువురు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఆమె గురించి తెలీదా? ఇదేదో సినిమా పబ్లిసిటీ స్టంట్ తప్పించి.. ఆమె ప్రేమలో పడి ఉండకపోవచ్చన్న వ్యాఖ్య చేస్తున్నారు. ఇరువురు కలిసి కొత్త ప్రాజెక్టులో చేస్తున్న నేపథ్యంలో అలాంటి పోస్టు పెట్టి ఉండొచ్చన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఆ వాదనలో నిజం లేదని.. అమ్మడు ప్రేమలో పడి ఉండొచ్చన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. పెట్టే పోస్టు ఏదో కాస్తంత క్లియర్ పెట్టేసి ఉంటే సరిపోయేది కదా?
This post was last modified on January 12, 2023 11:58 am
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…