సంక్రాంతి బడా సినిమాలతో సందడి మొదలైపోయింది. కానీ బన్నీ ఫ్యాన్స్ కి మాత్రం హ్యాపీ నెస్ లేదు. పుష్ప 2 అప్ డేట్ కోసం ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఎలాంటి న్యూస్ అందడం లేదు.ఇప్పటికే అప్ డేట్ ప్లీజ్ అంటూ ఫస్ట్ టైమ్ ఫ్యాన్స్ రోడ్డెక్కారు. అయినా టీం వారిని పట్టించుకోవడం లేదు. పుష్ప 2 షూటింగ్ జరుగుతుందో లేదో కూడా ఫ్యాన్స్ కి తెలియని పరిస్థితి.
ఇక అవతార్ 2 సినిమాతో పాటు పుష్ప 2 టీజర్ వస్తుందని ఆశించిన బన్నీ ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది. లాస్ట్ మినట్ లో గ్లిమ్స్ లోని బన్నీ డైలాగ్ లీక్ అవ్వడం, వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వకపోవడంతో అనుకున్న టైమ్ కి యూనిట్ పుష్ప 2 గ్లిమ్స్ రిలీజ్ చేయలేకపోయారు. సంక్రాంతికి పుష్ప 2 నుండి అప్ డేట్ ఉందనే టాక్ విన్పిస్తుండటంతో ఫ్యాన్స్ మళ్ళీ ఆశలు పెట్టుకుంటున్నారు.
సంక్రాంతికి పుష్ప 2 గ్లిమ్స్ వచ్చే అవకాశం ఉందా ? లేదా అనేది కూడా మేకర్స్ నుండి లీక్ రావడం లేదు. దీంతో అల్లు అర్జున్ ఆర్మీ అని పిలుచుకునే ఫ్యాన్స్ అంతా అప్ డేట్ లేదా పుష్ప అంటూ మైత్రి నిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నారు.
ప్రస్తుతం సంక్రాంతి రిలీజ్ లు , డిస్ట్రిబ్యూషన్ , ప్రమోషన్స్ తో ఊపిరి ఆడనంత బిజీగా ఉన్న మైత్రి నిర్మాతలు పుష్ప అప్ డేట్ ఇచ్చే అవకాశం అయితే లేదు. మరి ప్రచారంలో ఉన్నట్టు సంక్రాంతికి టీజర్ ఉంటుందా ? లేదా చూడాలి.
This post was last modified on January 11, 2023 4:09 pm
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…
సంక్రాంతి పండక్కు తెలుగు రాష్ట్రాల థియేటర్లకు ఊహించిన సమస్యే తలెత్తింది. షోలు చాలక ప్రేక్షకుల డిమాండ్ అధికం కాగా దానికి…
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…