ఎట్టకేలకు ఎదురు చూసిన అద్భుత క్షణం వచ్చేసింది. సినీ అభిమానులు మనసారా కోరుకున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో బెస్ట్ సాంగ్ – మోషన్ పిక్చర్ విభాగం కింద ఎంఎం కీరవాణి సగర్వంగా పురస్కారాన్ని అందుకున్నారు.
అశేష ఆహుతుల మధ్య రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు ఈ ముగ్గురి కుటుంబ సభ్యుల ప్రత్యక్ష హాజరులో సగర్వంగా తీసుకున్నారు. ఇది ముందే ఊహించినప్పటికీ ఒక్కోసారి ఇలాంటి వేదికల్లో చివరి నిమిషం ట్విస్టులు ఉంటాయి. ఆ భయాలేవీ లేకుండా నాటు నాటు గొప్ప పాటగా నిలిచిపోయింది.
చంద్రబోస్ సాహిత్యం అందించిన నాటునాటుకి కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ అందించిన నృత్య దర్శకత్వం తారక్ చరణ్ లు పోటీ పడుతూ చేసిన నృత్యం ఆ పాట స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లాయి. ముప్పై ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్న కీరవాణి ఇప్పటి జనరేషన్ తోనూ పోటీపడగల సత్తా తనలో ఉందని మరోసారి చాటి చెప్పారు.
సోషల్ మీడియా మొత్తం ఈ వీడియో తాలూకు అభినందనలతో హోరెత్తిపోతోంది. ఇంత పెద్ద అంతర్జాతీయ వేదిక మీద ఇలాంటి గౌరవం దక్కించుకోవడం కీరవాణికే ఒక తెలుగు సంగీత దర్శకుడికే ఇది మొదటిసారని చెప్పొచ్చు
అవతార్ సృష్టికర్త జేమ్స్ క్యామరూన్ లాంటి దిగ్గజాలు విచ్చేసిన ఈవెంట్ ఇది. ఆస్కార్ ని టార్గెట్ చేసిన రాజమౌళి దాన్ని కూడా నెరవేర్చుకునే పట్టుదలతో దేశదేశాలు తిరుగుతూనే ఉన్నారు, జపాన్ తో మొదలుపెట్టి ఇప్పటి లాస్ ఏంగిల్స్ దాకా తన హీరోలను వెంటబెట్టుకుని తిరుగుతున్న తీరు అందరికీ స్ఫూర్తి లాంటిది.
ఒకవేళ నాటునాటు కనక ఆస్కార్ గెలుచుకుంటే స్టేజి మీద లైవ్ పెర్ఫార్మన్స్ ఇప్పిస్తానని జక్కన్న ఫారిన్ రిపోర్టర్ కు చెప్పడం దానికి చరణ్ మద్దతు పలకడం విశేషం. సో మార్చిలో తెలుగువాడు గర్వంగా ఉప్పొంగిపోయే క్షణం వస్తుందా చూద్దాం
This post was last modified on January 11, 2023 9:31 am
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…
కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల…
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…