Movie News

శాకుంతలం.. వర్కవుటవుతుందా?

సమంత ప్రధాన పాత్రలో సీనియర్ దర్శకుడు గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో రూపొందించిన సినిమా ‘శాకుంతలం’. ‘రుద్రమదేవి’ లాంటి సాహసోపేత చిత్రంతో మంచి ఫలితాన్నందుకున్న గుణ.. ఆ తర్వాత మళ్లీ రిస్క్ చేసి ఈ భారీ చిత్రాన్ని తీశాడు. ‘రుద్రమదేవి’ వర్కవుట్ అయింది కాబట్టి మళ్లీ ఓ కథానాయికను పెట్టి తీసిన భారీ చిత్రం కూడా అలాగే ప్రేక్షకులను మెప్పిస్తుందని గుణ ఆశించినట్లున్నాడు.

కానీ ‘శాకుంతలం’ ట్రైలర్ చూశాక నిజంగా ఇది వర్కవుట్ అయ్యే సినిమానేనా అని సందేహాలు కలుగుతున్నాయి. ‘రుద్రమదేవి’లో ఉన్న సహజమైన భారీతనం.. కథానాయిక పాత్రలో వీరోచిత లక్షణాలు ఇందులో కనిపించలేదు. సమంతకు అనుష్క తరహా ఇమేజ్ లేదు. సినిమాలో ఆమె పాత్ర కూడా రుద్రమదేవి లాగా యోధురాలి క్యారెక్టర్ కాదు. దీని వల్ల ఇది ‘రుద్రమదేవి’లా మాస్‌ను అట్రాక్ట్ చేయడం కష్టమే.

‘రుద్రమదేవి’లో రానా ఉండడం దానికి కొంత ప్లస్ అయింది. కానీ ఇందులో మనకు పరిచయం లేని ఒక మలయాళ నటుడిని కథానాయికకు జోడీగా పెట్టారు. అతను సినిమాలో ఎన్ని వీరోచిత విన్యాసాలు చేసినా మన వాళ్లు కనెక్ట్ కావడం కష్టమే. ‘రుద్రమదేవి’కి అల్లు అర్జున్ ప్లస్ అయినట్లు ఇందులో స్పెషల్ క్యారెక్టర్ కూడా ఏమీ కనిపించడం లేదు. కథ పరంగా విషయం ఉన్నప్పటికీ.. ట్రైలర్ చూసిన జనాలకు మాత్రం క్యూరియాసిటీ పెంచే అంశాలేమీ పెద్దగా కనిపించలేదు. గ్రాఫిక్స్ అవీ గట్టిగానే ఉన్నట్లు అనిపించినా.. నేచురల్ ఫీలింగ్ కలగలేదు. సమంత తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం కూడా మైనస్ అయినట్లు కనిపిస్తోంది.

మొత్తంగా చూస్తే గుణ అండ్ టీం అంత కష్టపడి, భారీగా ఖర్చు పెట్టి చేసిన ‘శాకుంతలం’ సినిమా కమర్షియల్‌గా ఏమాత్రం ఆడుతుందో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ‘రుద్రమదేవి’ విషయంలోనూ బడ్జెట్ వర్కవుట్ అవుతుందా అన్న డౌట్లు కలిగాయి. కానీ ఆ సినిమా అంచనాలను మించి విజయం సాధించింది. ‘శాకుంతలం’ కూడా సందేహాలను పటాపంచలు చేసి బాక్సాఫీస్ సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి.

This post was last modified on January 10, 2023 5:30 pm

Share

Recent Posts

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

2 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

2 hours ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

3 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

4 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

5 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

7 hours ago