మామూలుగా బాలీవుడ్ టాలీవుడ్ హీరోల సత్సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ గత కొన్నేళ్లతో ఇవి మంచి పరిణామాలకు దారి తీస్తున్నాయి. ఒకప్పుడు ఏదో ముంబైలో కలుసుకున్నప్పుడు హై బై చెప్పడమే తప్ప పరస్పరం కొత్త సినిమాల కబుర్లు పబ్లిక్ గా పంచుకోవడం ఉండేది కాదు. సోషల్ మీడియా వచ్చాక ఇది బాగా సులువైపోయింది. సల్మాన్ ఖాన్ మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న బాండింగ్ గాడ్ ఫాదర్ కి ఎంత ఉపయోగపడిందో దానికి వచ్చిన నార్త్ కలెక్షన్లే సాక్షి. ఇదే కండల వీరుడి కిసీకా భాయ్ కిసీకా జాన్ కోసం వెంకటేష్ ఫుల్ లెన్త్ రోల్ చేస్తే రామ్ చరణ్ ఓ చిన్న పాత్ర చేశాడు. ఇదంతా స్నేహమే.
తాజాగా ఈ లిస్టులో షారుఖ్ ఖాన్ వచ్చేశాడు. తన లేటెస్ట్ మూవీ పఠాన్ ట్రైలర్ ఈ రోజు యూట్యూబ్ లో వచ్చిన సంగతి తెలిసిందే. కంటెంట్ ఎలా ఉన్నా అందులో యాక్షన్ ఎపిసోడ్స్ మైండ్ బ్లోయింగ్ అనేలా కేవలం రెండున్నర నిమిషాల వీడియోలోనే అర్థమైపోయింది. విజయ్ దీని గురించి ప్రత్యేకంగా ట్వీట్ చేయడం ఆల్రెడీ వైరల్ అయ్యింది. తాజాగా రామ్ చరణ్ పఠాన్ గురించి గొప్పగా చెబుతూ ఎప్పుడూ చూడని పోరాట దృశ్యాల్లో స్క్రీన్ మీద చూసేందుకు వెయిట్ చేస్తున్నట్టు విషెస్ చెప్పాడు. అయితే కింగ్ ఖాన్ సింపుల్ గా థాంక్స్ తో సరిపెట్టకపోవడమే అసలు ట్విస్టు.
మీ ఆర్ఆర్ఆర్ బృందం ఆస్కార్ ని ఇండియాకు తెచ్చినప్పుడు ఒకసారి దాన్ని తాకే అవకాశం ఇమ్మని అందులో అభ్యర్థించడం ఇద్దరి అభిమానులను ఆకట్టుకుంది. ముందు ఇంగ్లీష్ లో పెట్టి దాని అనువాదాన్ని తెలుగులో కూడా ట్వీట్ చేయడం మరో విశేషం. చరణ్ ని మెగా పవర్ స్టార్ అని సంబోధించడం గమనార్హం. విజయ్ కు కూడా స్పందించిన షారుఖ్ ఈరోజు అదే పనిగా సెలబ్రిటీలకు రెస్పాన్స్ ఇస్తున్నాడు. కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీగా చెప్పుకుంటున్న పఠాన్ మీద కింగ్ ఖాన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. జనవరి 25న హయ్యెస్ట్ ఓపెనింగ్స్ వస్తాయనే అంచనాలో బాలీవుడ్ వర్గాలున్నాయి.
This post was last modified on January 10, 2023 3:57 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…