బాలీవుడ్ అతి పెద్ద సూపర్ స్టార్స్ లో ఒకరైన షారుఖ్ ఖాన్ మూడేళ్ళ గ్యాప్ తీసుకోవడమంటే చిన్న విషయం కాదు . వరుస డిజాస్టర్లతో విసుగు చెంది అభిమానులకు బెస్ట్ ఇవ్వడం కోసం ఆచి తూచి మరీ పఠాన్ ని ఎంచుకున్నాడు.
హృతిక్ రోషన్, టైగర్ శ్రోఫ్ లతో 2019లో వార్ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన సిద్దార్థ్ ఆనంద్ దీనికి దర్శకుడు. వైభవం తగ్గిపోతున్న హిందీ సినిమాకు పూర్తి స్థాయి ఆక్సిజన్ ఇచ్చే మూవీగా దీని మీద మాములు అంచనాలు లేవు. జనవరి 25న ఐమ్యాక్స్ తో సహా అన్ని రకాల ఫార్మట్లలో దీన్ని విడుదల చేయబోతున్నారు. ఇంత హైప్ మధ్య ఇవాళ ట్రైలర్ వచ్చేసింది.
కథనేమీ దాచలేదు. కరుడుగట్టిన తీవ్రవాద ముఠా నాయకుడు(జాన్ అబ్రహం)కి ఇండియా మీద దాడులు జరిపే ఒక పెద్ద కాంట్రాక్ట్ వస్తుంది. దాన్ని అతను స్వీకరిస్తాడు. అంతే కాదు ఏకంగా ఇండియన్ ఆర్మీకి సవాల్ విసురుతాడు. దీంతో అజ్ఞాతంలో ఉన్న పఠాన్ (షారుఖ్ ఖాన్) ని బయటికి తెస్తుంది భారత ప్రభుత్వం.
మరో లేడీ ఏజెంట్(దీపికా పదుకునే)తో కలిసి మిషన్ మొదలుపెడతాడు. ఈ మధ్యలోనే లవ్ రొమాన్స్ అన్నీ జరిగిపోతాయి. ఇంతకీ పఠాన్ ఈ కుట్రను ఎలా భగ్నం చేశాడు. తన జాతి గౌరవాన్ని ఎలా నిలబెట్టాడు అనేదే స్టోరీ. గతంలో ఇలాంటి పాయింట్ తో అజయ్ దేవగన్ ఖయామత్ లాంటి చాలా సినిమాలొచ్చాయి
యాక్షన్ విజువల్స్ పరంగా చాలా గ్రాండ్ లుక్ తో ఉన్నాడు పఠాన్. ఎప్పటిలాగే సిద్దార్థ్ ఆనంద్ నమ్మశక్యం కానీ ఫిజిక్స్ ని ఛాలెంజ్ చేసే స్టంట్స్ ని లెక్కలేనన్ని పెట్టాడు. కొన్ని ఏకంగా మిషన్ ఇంపాజిబుల్ రేంజ్ లో ఉన్నాయి. మాస్ ఆడియన్స్ కి కావలసిన గూస్ బంప్స్ సరుకైతే బాగానే దట్టించారు.
షారుఖ్ జాన్ ల మధ్య ఫేస్ టు ఫేస్ ఫైట్లే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. బాద్షాని ఇలాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్ లో చూసి చాలా కాలం కావడంతో ఓపెనింగ్స్ భారీ ఎత్తున రావడం ఖాయం. విశాల్ శేఖర్ సంగీతం అందించగా సత్చిత్ కెమెరా యాంగిల్స్ అదిరిపోయాయి. మరి పఠాన్ ఏ మేరకు మెప్పిస్తాడో ఇంకో రెండు వారాల్లో తేలిపోతుంది
This post was last modified on January 10, 2023 11:29 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…