పాపం సమంత.. గత కొన్ని నెలల నుంచి ఈ మాట అనుకోని అభిమానులు లేరు. ఒకటిన్నర దశాబ్దం నుంచి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఈ చెన్నై అమ్మాయి.. తెలుగమ్మాయిగా మారిపోయి చాలా కాలం అయింది. సినీ కెరీర్‌లో పీక్స్‌ను అందుకున్నాక అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకుని మూడేళ్లు సంతోషంగా వైవాహిక జీవితాన్ని ఆస్వాదించిన ఆమె.. ఏడాదిన్నర కిందట అతడి నుంచి విడిపోవడం తెలిసిందే.
ఆ తర్వాత తన కెరీర్‌ను పొడిగించుకుని తిరిగి పీక్స్‌ను అందుకునేలా కనిపించిన సామ్.. కొన్ని నెలల కిందట మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. అప్పట్నుంచి చికిత్స తీసుకుంటున్న సామ్.. ఇటీవల కోలుకున్నట్లుగా వార్తలొచ్చాయి. తన కొత్త చిత్రం శాకుంతలం ప్రెస్ మీట్‌కు కూడా సమంత వస్తోందని తెలిసి అభిమానులు సంతోషించారు.
కానీ శాకుంతలం ప్రెస్ మీట్లో సమంత అంత సౌకర్యంగా కనిపించలేదు. ఆమెలో అన్ ఈజీనెస్ స్పష్టంగా తెలిసిపోయింది. ఉన్నంతసేపు సమంత ఇబ్బందిగానే కనిపించింది. సమంత డల్‌గా కనిపించడంపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. తనలో గ్లో పోయిందంటూ పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్టుపై సమంత స్వయంగా స్పందించడం గమనార్హం.
తనలా నెలల తరబడి ట్రీట్మెంట్ తీసుకోకూడదని తాను కోరుకుంటానని.. తాను అందిస్తున్న ప్రేమతో గ్లో పొందాలని ఆ పోస్టు మీద కౌంటర్ వేసింది సమంత. ఆమెకు మద్దతుగా నెటిజన్లు చాలామంది ట్వీట్లు వేశారు. వ్యక్తిగత జీవితంలో ఒడుదొడుకులను తట్టుకుని నిలబడ్డ కొంత కాలానికే ఇలా అనారోగ్యం పాలై పోరాడాల్సి రావడంపై అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె పూర్తిగా కోలుకుని ముందులా హుషారుగా తయారవ్వాలని అందరూ కోరుకుంటున్నారు.
This post was last modified on January 10, 2023 6:09 am
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…